Cognizant ఉద్యోగులకు 100% బోనస్
Cognizant ఉద్యోగులకు శుభవార్త – 100% బోనస్ ప్రకటించిన కంపెనీ
ప్రముఖ ఐటీ సంస్థ Cognizant తన ఉద్యోగులకు 100% బోనస్ అందిస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ అంచనాలకు మించి పూర్తి ఆర్థిక సంవత్సర ఫలితాలు నమోదు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
కంపెనీ CEO రవి కుమార్ గత ఏడాది నుంచి పలుమార్లు ప్రస్తావించిన “Winner’s Circle” లక్ష్యాలను ఊహించిన దానికంటే ముందుగానే Cognizant సాధించిందని తెలిపారు.
Winner’s Circle అంటే ఏమిటి?
Winner’s Circle అనేది Cognizant నిర్దేశించుకున్న ముఖ్య వ్యూహాత్మక లక్ష్యాలను సూచిస్తుంది. వీటిలో:
- టాప్-టియర్ రెవెన్యూ వృద్ధి
- మార్కెట్ షేర్ పెంపు
- పెద్ద డీల్‌ల నిరంతర విజయాలు
- ఉద్యోగుల నైపుణ్యాభివృద్ధి (Upskilling)
- లాభ మార్జిన్ల విస్తరణ
- రెవెన్యూ కంటే అధికంగా EPS (Earnings Per Share) వృద్ధి
ఈ అన్ని అంశాల్లో కంపెనీ ఆశించిన దానికంటే మెరుగైన ఫలితాలు సాధించడంతో, ఉద్యోగులకు పూర్తి బోనస్ ఇవ్వడం జరిగింది.
పూర్తి సమాచారం కోసం ఈ లింక్ చూడండి: https://mybs.in/2g3mEkL



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి