ప్రజావాణి!!!!
గౌరవ తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్య మంత్రి *శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి* కి విన్నపం!!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కుల గణన సర్వే లో కేవలం కుల గణన మాత్రమే చేపట్టకుండ వ్యక్తి గత వివరాలు, బ్యాంకు ఖాతా ఆర్థిక వివరాలు , ఆదాయ వనరులు ఎందుకు సేకరిస్తున్నారో ప్రజా క్షేత్రం లో ప్రజలందరికీ చెప్పాలి...
👉దానికంటే ముందు గౌరవ ముఖ్య మంత్రి గారు సంపాదించిన ఆస్తులు, ఆర్థిక వివరాలు ప్రజలందరికీ ఖచ్చితంగా వెల్లడి చేయాలి(సర్వే చేసినప్పుడు)
👉మీ మంత్రి ల, ఎమ్మెల్యే ల, ఎంపీ ల, స్థానిక ప్రజా ప్రతినిధుల ఆదాయం, ఆస్తుల వివరాలు, మీ పార్టీ అధిష్టానం ఐన గాంధీ కుటుంబం గత 75 ఏళ్లుగా దేశం మొత్తం మీద సంపాదించిన ఆదాయం, ఆస్తుల వివరాలు ప్రజా క్షేత్రం లో ఖచ్చితంగా వెల్లడి చేయాలి!!!
👉ముఖ్యంగా ఇతర కులాల సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఉందో తెలుసుకునే గౌరవ ముఖ్య మంత్రి గారు మీ కుల జనాభా ఎంత ఉందో వెల్లడి చేయాలి!!!!
👉కాంగ్రెస్ పార్టీ కేవలం మీ రెడ్డి కులానికే గత 75 సంవత్సరములు గా ముఖ్య మంత్రి పదవిని ఎందుకు కట్టబెడుతుందో మిగతా కులాలకు ముఖ్య మంత్రి పదవిని ఎందుకు ఇవ్వడం లేదో ప్రజా క్షేత్రం లో వెల్లడి చేయాలి!!!!!
👉ముఖ్య మంత్రి పదవి అనే ఉద్యోగం కు రాష్ట్రం లో *కేవలం రెడ్డి కులానికి మాత్రమే రిజర్వేషన్ లు*
*ప్రదాని పదవికి* మెజారిటీ గా *గాంధీ కాని గాంధీ కుటుంబానికి మాత్రమే రిజర్వేషన్ లు* ఎందుకు కేటాయిస్తున్నారో అన్ని కులాలకు వెల్లడి చేయాలి!!!
👉మీరు అనుభవించే ముఖ్య మంత్రి స్థానం ప్రజాస్వామ్య బద్దం ..మరి అలాంటప్పుడు ఎన్నికల సమయంలో మీరు ప్రజలకు ప్రజల రాజ్యము అని ప్రచారం చేయకుండ ఇందిరమ్మ రాజ్యము, రాజన్న రాజ్యము ఎందుకు ప్రచారం చేసారో వెల్లడి చేయాలి!!!!
👉మరీ ముఖ్యంగా కుల గణన వల్ల మిగతా కులాలకు ముఖ్య మంత్రి స్థానం కాంగ్రెస్ పార్టీ ఇస్తుందన్న గ్యారెంటీ ఐతే మాకు లేదు.. గత 75సంవత్సరాలుగా
మరి అలాంటప్పుడు మిగతా కులాల వివరాలు తెలుసుకోవడం వల్ల మిగతా కులాలకు ఒరిగిందేమిటి????
👉ఆర్థికంగా వెనుకబడిన వారు ప్రతీ కులంలో ఉన్నారు కానీ కులం పేరుతో మనుషులు ను వేరు చేసి చూసే కంటే ఆర్థికంగా వెనుకబడిన వారిని గుర్తించి ప్రభుత్వం సంక్షేమం మరియు అభివృద్ధి చేయాలి.. కాని అలా జరగడం లేదు
👉మతం పేరుతో రిజర్వేషన్ లు రద్దు చేసి మతంలో నిరుపేద, పేద, మద్య తరగతి ప్రజలకు సంక్షేమ నిధులను కేటాయించాలి కాని స్వాతంత్ర్యము వచ్చి 75ఏల్లు గడుస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంకా మతంను మైనారిటీ పేరుతో వేరు చేసి మెజారిటీ మతస్తుల ఆగ్రహము కు కారణమైంది..
నిరుపేద, బీద, మద్య తరగతి ప్రజలు ప్రతీ కులంలో ఉన్నారు, ప్రతీ మతం లో ఉన్నారు దానికి కులం, మతం ప్రామాణికం కాదు....
ముఖ్య మంత్రి గా రాష్ట్రాన్ని పరిపాలన చేయడానికి, ప్రధాని పదవి తో దేశాన్ని పరిపాలించడానికి ఈ దేశంలో, ఈ రాష్ట్రం లో ప్రతి కులం , ప్రతీ కుటుంబం అర్హత కలిగిన వారే కాని మరి కేవలం మీ రెడ్డి కులమే ఎందుకు ముఖ్య మంత్రి పీఠము, కేవలం గాంధీ కాని గాంధీ కుటుంబమే ప్రధాని పీఠము ఎందుకు అనుభవిస్తుంది???
దేశం పట్ల, రాష్ట్రం పట్ల ప్రేమ ఉన్నవారు కులాన్ని, కుటుంబం కంటే ఎక్కువ గా నా దేశ ప్రజల, నా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరుకుంటారు.. కాని కాంగ్రెస్ పార్టీ గత 75 ఏళ్లు గా మీ రెడ్డి కుల శ్రేయస్సు, మీ గాంధీ కాని గాంధీ కుటుంబ శ్రేయస్సు ప్రధానంగా భావిస్తుంది ఎందుకు?????
ఈ ప్రశ్నలకు మాకు సమాధానము చెప్పడం రాజ్యాంగ విరుద్ధమని, చట్ట విరుద్ధం ,ప్రజాస్వామ్య విరుద్ధం అని మీరు భావిస్తే మీరు మమ్మల్ని కులం పేరుతో వివరాలు అడగడం కూడా ప్రజాస్వామ్య, రాజ్యాంగ విరుద్ధమే అవుతుంది
మీ వివరాలు ప్రజల ముందర వెల్లడి చేయనప్పుడు మా వివరాలు మీరు అడిగే అధికారము మీకు లేనట్టే!!!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి