నిందితులను నడిరోడ్డు పై ఉరితీయాలి!!! - మహిళ

 



















హసన్పర్తి మండల కేంద్రము లో త్రిశూల్ యువ అభివృద్ధి కమిటీ మరియు భవ్య నారసింహ మందిర సాధన సంఘటణ్ ఆద్వర్యంలో త్రిశూల్ జెండా కూడలి, ఆర్టీసీ కాలనీ వద్ద కలకత్తాలో ట్రైనీ వైద్యురాలిపై జరిగిన అత్యాచారం ను ఖండిస్తూ కొవ్వొత్తులతో స్థానిక మహిళలు, పురుషులు నిరసన తెలిపారు.  ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండాలంటే నిందితులను నడిరోడ్డు పై ఉరి తీసే కఠినమైన చట్టం తీసుకు రావాలని, ఎన్కౌంటర్ చేయాలని తెలిపారు. ఆడవారి ని చూసే విధానం లో మగవారి ఆలోచన విధానం మారాలి అని తెలిపారు. ఒక మహిళా ముఖ్య మంత్రి అయి వుండి సాటి మహిళ కు జరిగిన అత్యాచారం ను చేసిన నిందితులకు శిక్షించకుండా నిందితులను దాచిపెట్టడం మహిలాలోకానికే సిగ్గు చేటు అని తెలిపారు. 











కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు