కొందరు కావాలనే నాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు...అరూరి.
తెలంగాణ భవన్
హైదరాబాద్
బీజేపీ పార్టీలో చేరుతున్నాని చేసే అసత్య ప్రచారాలను ప్రజలు,కార్యకర్తలు నమ్మవద్దు.....
గత 3రోజులుగా సోషల్ మీడియా ద్వారా మరియు వివిధ ఛానళ్ళ ద్వారా నేను పార్టీ మారుతున్నట్లు నా పై కావాలని దుష్పప్రచారం చేస్తున్నారని బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్దన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు అన్నారు.
హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అరూరి రమేష్ గారు మాట్లాడుతూ కొందరు ప్రతిపక్ష నాయకులు నేను బీజేపీ పార్టీలో చేరుతున్నట్లు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మవద్దని కోరారు. తాను తాను ఇప్పుడు, ఎప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షునిగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు గార్ల సారథ్యంలో పార్టీ ఏ భాద్యత అప్పగించిన నిర్వహిస్తానని తెలిపారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి