మార్పు అంటే ఇదేనా ముఖ్య మంత్రి గారు???

 


 తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగి పదేల్ల తర్వాత, తెలంగాణ రాష్ట్రం రెండవ ముఖ్య మంత్రి గా పదవీ బాధ్యత లు చేపట్టిన శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి  హ్రుదయపూర్వక అభినందనలు...మార్పు రావాలి అనే అభిప్రాయం తో తెలంగాణ ప్రజలు మిమ్మల్ని భారీ మెజారిటీ తో గెలిపించినందుకు తెలంగాణ ప్రజానీకానికి క్రుతజ్ఞతలు

🙏🙏🙏🙏🙏🙏

💐💐💐💐💐💐


ప్రజాభిమతం ను శిరసావహిస్తూ, మీ ముందు తెలంగాణ ప్రజలు ఎదుర్కోంటున్న సమస్య ను 

విన్నవిస్తున్నాను!!! 


👉మహిలలకు గౌరవించాలి,మహిలా సాధికారత అనే సంకల్పం తో తెలంగాణ ఆర్టీసి బస్సు లలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు మంచి పరిణామమే కావచ్చు కానీ ఇందులో తెలంగాణ ప్రజల సొత్తు, ప్రభుత్వ ఆస్తి అయిన ఆర్టీసి సంస్థ ఏవిధముగా లాభాల బాటలో పయనిస్తుందో ప్రజలకు దయచేసి వివరంగా చెప్పగలరు!!! 

👉 ఆర్టీసి బస్సులో మహిలల గౌరవార్ధం ఇప్పటికే సగం బాగం సీట్లు ఇంతకు ముందు ప్రభుత్వాలు మహిలలకు కేటాయింపు జరిగింది.. కానీ మీరు ఆ సగం సీట్లు ఉచితంగా ఇస్తున్నారు దీని వల్ల ఆర్టీసి బస్సు కండక్టర్ కు వచ్చే ఆదాయం ఎంత???

ప్రజల ఆస్తి అయిన ఆర్టీసి సంస్థ సంపాదించే ఆదాయం ఎంత??? దీని వల్ల ప్రభుత్వం కు అంటే తెలంగాణ ప్రజలకి కలిగే లాభం ఏంటి??? 

👉ఉచితం గా ఇస్తున్నారు సరే  మరి అలా ఇవ్వ మని తెలంగాణ ప్రజలు అడిగారా!!???


👉తెలంగాణ ప్రభుత్వం అంటే పూర్తి గా తెలంగాణ ప్రజల ఆస్తి!!(ఇందులో మహిలలు కూడా ఉన్నారు )

మరి ఆ ఆస్తి ని ఉచితంగా దానాలు, ధర్మం చేయమని మీకు అధికారాన్ని కట్ట బెట్టారా???? 

👉మీకు ఓటు వేసింది తెలంగాణ ప్రజల ఆస్తులైన తెలంగాణ ప్రభుత్వ సంస్థ లను కాపాడటానికి కానీ నష్ట పరచటానికి కాదు! అది మీక్కూడా తెలుసు మరి అన్ని తెలిసిన మీరు ప్రజల ఆస్తి ఐన ఆర్టీసి సంస్థ ను ఎందుకు నష్టం చేస్తున్నారు??? 


👉తెలంగాణ ప్రజలు పన్నులు కడుతూ ప్రజల ఆస్తి ఐన తెలంగాణ ప్రభుత్వం ను పెంచి పోషిస్తున్నారంటే దానర్థం తెలంగాణ ప్రభుత్వం ను అవినీతి రహిత, అర్థవంతమైన,పారదర్శక మైన అభివ్రుద్ది చేసే పాలన గా తీర్చిదిద్దమని కానీ పన్నులు కట్టే ప్రజలను ముఖ్యంగా మహిళలను వీధి బిచ్చగాళ్లు గా చేయడానికి కాదు!!!

👉మీరు ప్రయాణం లో ఉచితం కల్పించి ప్రభుత్వం ను నష్టం చేయటం కంటే అదే సంస్థ లో అంతే ఖర్చు తో ఎంతో మంది నిరుద్యోగులుగా ఉన్న తెలంగాణ యువతకు ఉద్యోగులుగా తీర్చిదిద్దవచ్చు!!!

 

👉 మహిలా సాధికారతే ధ్యేయం గా నిర్ణయం తీసుకున్నారు అని తెలంగాణ ప్రభుత్వం పేరుతో మీరు ప్రకటన చేస్తుంది మహిలలను వీధి బిచ్చగాళ్లు గా తయారు చేయడానికా??? లేక వారికి  ఉపాధి అవకాశం అదే సంస్థ లో కల్పించి మహిలలకు నిజమైన సాధికారత కల్పించటానికా???

👉ఆర్టీసి సంస్థ లో ఉచిత ప్రయాణం పేరుతో నష్ట పోయేది కేవలం ప్రజల ఆస్తి ఐన ఆర్టీసి సంస్థ మాత్రమే కాదు, తెలంగాణ ప్రభుత్వం కూడా!!!! 

👉మరి ఇంత భారీ నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారు??? 

👉ఇటు ఉచితాల పేరుతో ఇటు పంచినట్టే పంచి, ప్రజల మీద పన్ను ల రూపంలో, ధరల రూపంలో ధరలు విపరీతంగా పెంచటానికా ముఖ్య మంత్రి గారు మీకు అధికారాన్ని కట్ట బెట్టింది??? 

👉మరియు మీరు తీసుకున్న నిర్ణయం వల్ల నష్ట పోయేది కేవలం ప్రజలు పన్నుల రూపంలో కట్టి పెంచి పోషిస్తున్న ఆర్టీసి సంస్థ మాత్రమే కాదు ఇటు రెక్కాడితే కాని డోక్కాడని టాక్సీవాలా, ఆటోవాలా లు కూడా!!! మరియు వారి మీద ఆధారపడి జీవనం గడుపుతున్న కొన్ని లక్షల మంది కుటుంబాలు !!!

మరి వారి పొట్ట కొట్టడానికి,వారి బతుకులు బస్టాండ్ చేయడానికి మీకు అధికారాన్ని కట్ట బెట్టారా ముఖ్య మంత్రి గారు???? 


ఇదేనా మార్పు అంటే???


మార్పు అంటే ఇదేనా ముఖ్య మంత్రి గారు????

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు