మార్పు రావాలి!!!
గౌరవ తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్య మంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి విన్నవించునది ఏమనగా,
👉తెలంగాణ ప్రజలమైన మేము మీకు పన్నుల రూపంలో నెలవారీ జీతాలు చెల్లిస్తున్నాం!!!
👉మీ ఎమ్మెల్యేలకు పన్నుల రూపంలో నెలవారీ జీతాలు మేము చెల్లిస్తున్నాం!!
👉ప్రభుత్వ సంస్థ ఉద్యోగులకు, అధికారులకు నెలవారీ జీతం మేము పన్నుల రూపంలో చెల్లిస్తున్నాం!!!
👉ఆర్టీసి బస్ డ్రైవర్ లకి, ఆర్టీసి బస్ కండక్టర్స్ మరియు ఆర్టీసి సంస్థ యాజమాన్యం కు ,సిబ్బంది కి బస్ టికెట్టు రూపంలో, పన్నుల రూపంలో మేము నెలవారీ జీతాలు చెల్సిస్తున్నాం!!!
👉మీరు ఉపయోగించే అధికారిక వాహనాల నుంచి మోదలైతే, మేము ఉపయోగించే ఆర్టీసి బస్సులకు, పెట్రోల్, డీజిల్ ఖర్చు లకు పన్ను ల రూపంలో, టిక్కెట్ రూపంలో మేము ప్రతి నిత్యం చెల్లిస్తున్నాం!!!!
👉మరి ఇంత చేసిన మాకు, మహిళలకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా ముఖ్య మంత్రి గారు???? ఆర్టీసి బస్సు లో మహిలలకు ఉచిత ప్రయాణం ఎందుకు ఇస్తున్నట్లు???
👉మీకు నిజంగా మహిలల పట్ల గౌరవం ఉంటే తెలంగాణ రాష్ట్రం లో ఎంతో మంది డిగ్రీ లు, పిజీ లు చేసి చేసే ఉద్యోగం ఏమీ లేక వంటింటికే పరిమితం ఐన మహిలా మనులు నిరుద్యోగులుగా కొన్ని లక్షల మంది ఉన్నారు... మరి వారిని ఉపాధి అవకాశం అదే సంస్థ లో కల్పించి ఉద్యోగులుగా తీర్చి దిద్దండి!!!
👉తెలంగాణ లో ఎంతో మంది నిరుద్యోగ యువత ఉన్నారు మీరు ఉచితం పేరు చెప్పి మమ్మల్ని నష్టం చేసే కంటే ఆర్టీసి సంస్థ లో వేలాది మంది కి ఉపాధి అవకాశం కల్పన చేయండి !!!మేము సంతోషిస్తాం!!!!
మరీ ముఖ్యంగా మార్పు రావాలి అనే భావన తో తెలంగాణ నిరుద్యోగ యువత మీకు ఓటు వేసారు మరి ఉచిత ప్రయాణం ఇచ్చి మా నెత్తి మీద పన్ను ల రూపంలో, ధరల రూపం లో భారం మోపే కంటే ఆర్టీసి సంస్థ లో ఉద్యోగం కల్పించి మాకు భాసటగా ఉండగలరని ప్రార్థన!!!
ఇట్లు
తెలంగాణ నిరుద్యోగి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి