బీఆర్ఎస్ ఇంటింటి ప్రచార హోరు !!!!!
గెలుపే లక్ష్యంగా కారు జోరు
హాసన్ పర్తి: 66వ డివిజన్ కేంద్రంలో డివిజన్ అధ్యక్షులు పాపిశెట్టి శ్రీధర్ పిలుపుకై 27వ బూత్ ఇంచార్జ్ పెద్దమ్మ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వర్ధన్నపేట నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత మన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరూరి రమేష్ అన్న గారి గెలుపుకై ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది .ఈ ప్రచార కార్యక్రమంలో ప్రజలకు బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుండి తెలంగాణ ప్రజానీకానికి ఎన్నో రకాలుగా సంక్షేమ కార్యక్రమాలను చేపడుతూ ముందున్న తరుణంలో మన యువతకు ఎన్నో విధాలుగా ఉద్యోగాలు అవకాశాలను కల్పిస్తూ రైతులకు ఉచిత కరెంటు గాని రైతుబంధు గాని ఒంటరి మహిళలకు పింఛన్ల ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టినటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం మళ్ళీ రావాలని కోరుతూ మన నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో ఉండాలంటే ఆరూరి రమేష్ అన్న గారి కారు గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ మనందరం తోడు ఉంటామని తెలియజేశారు.ప్రచార కార్యక్రమంలో 100 ఓట్ల ఇంచార్జ్ లు దీకొండ బిక్షపతి, గోపరాజు రాజకుమార్, గోపరాజు ప్రసాద్, నల్ల కిరణ్,, సాయిని రాకేష్, ఓదెల రమేష్, ఓదెల ప్రవీణ్, ఆమంచ శివకుమార్ , పెద్దమ్మ సుమంత్, తంగళ్ళపల్లి కృష్ణ ప్రణీత్, యాద శివ సాయి, ఓదెల రాకేష్ కార్యకర్తలు సోషల్ మీడియా సభ్యులు పాల్గొని ప్రచార కార్యక్రమం నిర్వహించారు..
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి