పర్వతగిరి మండల ఎస్టీ గ్రామ పంచాయితీల పూర్తి మద్దతు అరూరికే....
జడ్పిటిసి సింగ్ లాల్ పార్టీని వీడడం వల్ల పార్టీకి ఎలాంటి నష్టం లేదు....
అరూరిని కలిసి మద్దతు ప్రకటించిన ఎస్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు....
జడ్పిటిసి సింగ్ లాల్ పార్టీ మారడం వల్ల బిఆర్ఎస్ పార్టీకి గాని, ఎమ్మెల్యే అరూరి రమేష్ గారికి గాని ఎలాంటి నష్టం లేదని పర్వతగిరి మండల ఎస్టీ గ్రామ పంచాయితీల ప్రజా ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ రోజు హన్మకొండ ప్రశాంత్ నగర్ల లోని ఎమ్మెల్యే గారి నివాసంలో పర్వతగిరి పర్వతగిరి మండల ఎస్టీ గ్రామ పంచాయతీల సర్పంచ్ లు, ఎంపిటిసిలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు అరూరి రమేష్ గారిని కలిసి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సింగ్ లాల్ పార్టీ వీడడం వల్ల నష్టం కంటే లాభామే ఎక్కువ అని అన్నారు. అరూరి రమేష్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని పర్వతగిరి మండల ఎస్టీ నాయకులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపిపి లునావత్ కమల పంతులు, వెంకన్న నాయక్, జితేందర్ రెడ్డి, మార్కెట్ డైరక్టర్ యాకంతం, జిల్లా నాయకులు యుగేందర్ రావు,ఎస్టీ గ్రామ పంచాయతీల సర్పంచ్ లు, ఎంపిటిసిలు, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి