ఢిల్లీ రిమోట్ కంట్రోల్ పార్ట్ 8
సిద్ధాంతం మరిచి పోయిన ఢిల్లీ రిమోట్ కంట్రోల్ పార్టీ లు కాంగ్రెస్, బీజేపి !!!
సెక్యులర్ వాదం నుంచి హిందుత్వం వాదం కాంగ్రెస్ సిద్ధాంతం
అసలు గాంధీ అయిన స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహాత్మా గాంధీ ని పక్కన పెట్టి గాంధీ పేరుతో దొంగ గాంధీ దొరలను గత 75 సంవత్సరములుగా పరిచయం చేసింది కాంగ్రెస్ పార్టీ
స్వాతంత్ర్యం తెచ్చినది మేమే స్వాతంత్ర్యం ఇచ్చినది మేమే అని చెప్పుకునే పార్టీ పాకిస్తాన్, బంగ్లాదేశ్ లను భారతదేశం నుంచి అప్పటి ప్రజల ,ముఖ్యంగా ఈ దేశం లో మెజారిటీ హిందూ ప్రజల అభిప్రాయం తీసుకోకుండా అన్యాయముగా మతం పేరుతో విభజన చేసి కూడా ఇంకా మన దేశం నుంచి ఇచ్చింది చాలలేదు అంటూ ఈ రెండు దేశాల నుంచి ఉగ్రవాదులను మన దేశం పై ఉసి గోల్పి అమాయకులైన భారతీయులను పోట్టన పెట్టుకుంది ఇప్పటికీ ఈ రెండు దేశాలను బద్ద శత్రువు లుగా తయారు చేసి భారత ప్రజల ఆగ్రహానికి గురి చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ నే !!!
1947భారతదేశం -పాకిస్తాన్ లుగా విడిపోయినప్పుడు అటు నుంచి ఇటు వచ్చే వారు ఇటు నుంచి అటు వలసలు వచ్చే ప్రజల మధ్య హిందూ -ముస్లిం ల మధ్య వివాదం స్రుష్టించింది కొన్ని లక్షల మంది నరమేధం స్రుష్టించింది కూడా కాంగ్రెస్ పార్టీ నే !!!
దిల్ సుఖ్ నగర్, గోకుల్ చాట్, లుంబినీ పార్క్, ముంబై తాజ్ హోటల్ ఇలా ఓక్కటేమిటి అధికారంలోకి వచ్చిన ప్రతి సారి కూడా ఏదో ఓక చోట అల్లర్లు, ఉగ్రవాద దాడులు స్రుష్టించి కొన్ని వేల మంది ని పొట్టన పెట్టుకుని కుటుంబాలను అనాథలుగా చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ నే!!!
మత మార్పిడి పేరుతో మాయ మాటలు చెప్పి అమాయకులైన హిందూ ప్రజలను బ్రెయిన్ వాష్ చేసి వారి పేరు మార్చి, వారి కట్టు బొట్టు మార్చి, వారి విశ్వాసాలను,వారి చరిత్ర అసలు చరిత్ర కాదు మేం చెప్పిందే చరిత్ర మా మతానిదే అసలు చరిత్ర అంటూ వారికి హిందూ వారసత్వం హక్కు లను ,ప్రభుత్వం ద్వారా వచ్చే అనేక సంక్షేమ పథకాలను దూరం చేసి వారి భూములను మతం పేరుతో లాక్కుని వారి పై ఆధిపత్యం చలాయించి,వారిని జాతి వ్యతిరేక, సంఘ విద్రోహులుగా మార్చేది కూడా కాంగ్రెస్ పార్టీ నే!!!
తెలంగాణ ఇచ్చింది మేమే, తెచ్చింది మేమే అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ రెండు రాష్ట్రాల సమస్య ను అపరిష్కృతంగా ఉంచి పదేల్ల ఉమ్మడి రాజధాని హైదరాబాదు అని చెప్పి పక్క రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లో కనీసం రాజధాని కావాలి అని నినదించకుండా సమాఖ్య ఆంధ్ర ఉద్యమం కు సపోర్టు చేసిన పక్క రాష్ట్రం ముఖ్య మంత్రి వై. ఎస్.జగన్ రెడ్డి సొంత చెల్లెలు వై. ఎస్. షర్మిలారెడ్డి ని అన్నా చెల్లెలు పంచాయతి పేరు చెప్పి ఆంధ్ర -తెలంగాణ పంచాయతి ను భీజం వేసింది కూడా కాంగ్రెస్ పార్టీ నే !!!
కాంగ్రెస్ పార్టీ అంటే సెక్యులరిజం పార్టీ అని చెప్పుకుంటూ ఇక్కడ మతం పేరుతో చిచ్చులు పెట్టి, అమాయకులైన భారతీయులను టార్గెట్ చేసుకుని ఉగ్రవాద శిక్షణ ఇచ్చే సంస్థ లను ఇక్కడ ఉసి గోల్పి వారిని సంఘ విద్రోహులుగా తయారు చేసే సంస్థ లను చాప కింద నీరుగా తయారు చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ నే!!!
మరి యొక్క ముఖ్య విషయం... ఎల్లప్పుడు కాషాయ ఉగ్రవాదం, ఆర్ ఎస్ ఎస్ వంటి సంస్థ లపై విరుచుకుపడే కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఇప్పుడు అదే ఆర్ ఎస్ ఎస్ లో శిక్షణ తీసుకున్న,ఏబీవిపి విద్యార్థి నాయకుడు, టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి ని కాంగ్రెస్ అక్కున చేర్చుకుంది !!!
ఇప్పుడు చెప్పండి నా ప్రియమైన ఓటరు మహాశయా!!
సెక్యులర్ వాదం అంటే మొదట ఉగ్రవాదం, తర్వాత మతమార్పిడి వాదం ఇప్పుడు హిందూ వాదం అని కాంగ్రెస్ చెబుతుంది మరి పూటకో సిద్దాంతముతో వచ్చి అసలు సిద్దాంతమే లేకుండా వచ్చే కాంగ్రెస్ పార్టీ ని నమ్మి ఓటేద్దామా??
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి