హరితహారం పథకం బాగుంది!!!!
ఓటరు అభిప్రాయం
ఉపాద్యాయుడు
స్టేషన్ ఘన్పూర్
కేసీఆర్ గారు ప్రవేశ పెట్టిన పథకాలలో హరితహారం పథకం బాగుంది.. రోజు రోజు కు కాలుష్యం పెరుగుతున్న సమయంలో భూమి కాలుష్యం తగ్గించటానికి, వాతావరణం లో ప్రాణవాయువు శాతం పెంచటానికి ఊరూరా పచ్చదనం పెంచటానికి ముఖ్య మంత్రి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం సాహసోపేతం..మంత్రి కేటీఆర్ గారు గ్రీన్ చాలెంజ్ మొదలగు కార్యక్రమం ద్వారా యువతకు తెలియజేస్తున్నందుకు దన్యవాదములు... గతంలో చంద్ర బాబు హయాంలో పచ్చదనం పరిశుభ్రత పేరుతో విరివిగా చెట్లు నాటించటం అడవులు పెంపకం కార్యక్రమం జరిగేది.. ఆ తర్వాత వై ఎస్ రాజశేఖరరెడ్డి గారి హయాం లో హరిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం పెట్టినా పెద్దగా విజయం సాధించలేదు.. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు కేవలం మన తెలంగాణ మాత్రమే కాదు భూమి పై కాలుష్యం నివారించటానికి గ్రామ స్థాయి లో ప్రకృతి వనం పేరుతో నర్సరీ లు ఏర్పాటు చేసి ప్రాణవాయువు అందిస్తున్నందుకు దానిలో ప్రజలను మమేకం చేసి కార్యక్రమం విజయవంతం చేస్తున్నందుకు దన్యవాదములు.. మొన్న కరోనా వచ్చి దేశమంతా ఆక్సీజన్ లేక అల్లాడిపోతున్నపుడు చెట్లు యొక్క ఆవశ్యకత గుర్తు చేసినందుకు దన్యవాదములు.అడవులను పెంచటం అంటే మనిషి,జీవుల ప్రాణాలను నిలబెట్టడం అన్నట్టే..!!!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి