వర్దన్నపేట నియోజకవర్గ సమగ్ర అభివృద్దే నా కర్తవ్యం.

 

"అందుకు అనుగుణంగానే అభివృద్దే లక్ష్యంగా నా కార్యాచరణ కొనసాగుతోంది....

గత రెండు పర్యాయలు వర్దన్నపేట ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని గెలిపించారు..

సీఎం కేసీఆర్ గారు మరోసారి మీకు సేవ చేసే అదృష్టాన్ని కల్పించారు..

మీ ఇంటి బిడ్డగా నిండు మనసుతో ఆశీర్వదించాలి...  మీకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలి...వర్దన్నపేట నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయడానికి అండగా నిలవాలి.వారంటీ కూడా లేని నాయకుల గ్యారంటీ పథకాలను ప్రజలు నమ్మొద్దు."





బిఆర్ ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ఉద్యమ నాయకులు, బిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి చేతుల మీదుగా నిన్న బీ ఫామ్ అందుకున్నారు. ఈ సందర్బంగా వర్దన్నపేట నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు మీడియా సమావేశం నిర్వహించారు.


ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కామెంట్స్:


👉వర్దన్నపేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాను.


👉నియోజకవర్గ ప్రజలతో మమేకమై, వారి కష్ట సుఖలలో పాలు పంచుకుంటున్నాను.


👉నియోజకవర్గ అభివృద్ధితో పాటు పేద ప్రజల అభ్యున్నతికి నిరంతరం పాటు పడుతున్న విషయం మీ అందరికి తెలుసు.


👉ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మూడోసారి మీకు సేవ చేసే అదృష్టాన్ని కల్పించారు.


👉మరోసారి మీ ఇంటి బిడ్డను నిండు మనసు ఆశీర్వదిస్తారనే నమ్మకం నాకు ఉంది.


👉2014,2018 కి మించిన మెజారిటీ అందిస్తారని ఆశిస్తున్నా.


👉తెలంగాణ ఏర్పాటుకు ముందుకు ముందు, ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో, వర్దన్నపేట నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మీ అందరికి తెలుసు....


👉 ఉద్యమ నేత, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే మార్గదర్శిగా నిలిచింది.


👉రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలను చూసి దేశంలో ని అనేక రాష్ట్రాలు అశ్చర్యపోతున్నాయి.... అనుసరిస్తున్నాయి.


👉చరిత్రలో చూడని అభివృద్ధిని.... ఏ నాయకుడు ఇవ్వలేని సంక్షేమ పథకాలను అందిస్తున్న గొప్ప నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్.


👉అలాంటి నాయకున్ని మనం గుండెల్లో పెట్టుకొని కాపాడుకోవాలి...


👉 గత 9న్నర ఏళ్లలో నియోజకవర్గ అభివృద్ధి కోసం పగలు రాత్రి తేడా లేకుండా పని చేస్తున్నాను.


👉 వర్దన్నపేట నియోజకవర్గ పరిధిలో గతంలో ఏ నాయకుడు చేయనటువంటి అభివృద్ధి పనులను 2వేల 63కోట్ల 10లక్షల రూపాయలతో చేపట్టాం.


👉నియోజకవర్గ వ్యాప్తంగా 2వేల 2వందల 79కోట్ల 77లక్షల రూపాయలతో ప్రతీ ఇంటికి, ప్రతీ గడపకు సంక్షేమ పథకాలను అందజేశాం.


👉 మొత్తం వర్దన్నపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు అభివృద్ధి, సంక్షేమానికి కలిపి 4వేల 3వందల 53కోట్ల 95లక్షల రుపాయలను ఖర్చు చేసాం.


👉ఎన్నికలు రాగానే కొందరు నాయకులు ఓట్ల కోసం గారడీలు చేస్తుంటారు....


👉మాయ మాటలు చెప్పి మభ్యపెట్టాలని చూస్తారు.


👉అధికారంలోకి వస్తే అది ఇస్తాం... ఇది ఇస్తాం అంటూ వాగ్దానాలు చేస్తారు...


👉వారంటీ కూడా లేని నాయకులు గ్యారంటీ పథకాలు అంటూ ప్రమాణాలు చేస్తారు...

👉అలాంటి పార్టీలలోని నాయకుల మాటలు నమ్మవద్దు....

👉అభివృద్ధిలో దూసుకుపోతున్న రాష్ట్రాన్ని ఆగం చేయాలనే కుట్ర చేస్తున్నారు....

👉మాటలు చెప్పే వారు ఎవరో.... పనులు చేసే వారు ఎవరో ప్రజలు గమనించాలి...

👉ఓట్ల కోసం రాజకీయాలు చేసే నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దు... గోస పడవద్దు....

👉నియోజకవర్గ అభివృద్ధి కోసం, మీ కోసం పని చేసే నన్ను ఆశీర్వదించండి....

ఈ కార్యక్రమంలో డీసిసిబి చైర్మన్ మార్నెని రవీందర్ రావు, రైతు బందు సమితి జిల్లా చైర్మన్ లలితా యాదవ్, ఎంపిపిలు, జడ్పిటిసిలు, కార్పొరేటర్లు, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు