భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_భగవద్గీత - 13.4
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
హరే కృష్ణ॥
భగవద్గీత - యధాతథము
_రోజుకు ఒక శ్లోకము_
త్రయోదశాధ్యయము
ప్రకృతి, పురుషుడు,చైతన్యము
-------------------------------------------------
🌼 భగవద్గీత - 13.4 🌼
తత్ క్షేత్రం యచ్చ యాదృక్చ
యద్వికారి యతశ్చ యత్ |
స చ యో యత్ప్రభావశ్చ
తత్సమాసేన మే శృణు ||
అనువాదము:
ఇప్పుడు ఈ క్షేత్రమును, అది నిర్మింపబడిన విధానమును, దానిలోని మార్పులను, దేనినుండి అది ఉద్భవించెను, క్షేత్రము నెరిగినవాడెవడు, అతని ప్రభావములకు సంబంధించిన నా సంక్షిప్త వర్ణనను వినుము.
కృష్ణకృపామూర్తి
శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి