భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_శ్లోకము - 13.1-2
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
హరే కృష్ణ॥
భగవద్గీత - యధాతథము
_రోజుకు ఒక శ్లోకము_
త్రయోదశాధ్యయము
ప్రకృతి, పురుషుడు,చైతన్యము
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
శ్లోకము - 13.1-2
అర్జున ఉవాచ
ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ
ఏతద్ వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ ||1||
శ్రీ భగవానువాచ
ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే |
ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః || 2 ||
అనువాదము
అర్జునుడు ఇట్లు పలికెను : ప్రియమైన ఓ కృష్ణా! ప్రకృతి మరియు పురుషుని (భోక్త) గూర్చి, క్షేత్రము మరియు క్షేత్రము నెరిగినవానిని గూర్చి, జ్ఞానము మరియు జ్ఞానలక్ష్యమును గూర్చి నేను ఎరుగదలచితిని.
శ్రీకృష్ణభగవానుడు పలికెను : ఓ కౌంతేయా! ఈ దేహము క్షేత్రము మరియు ఈ దేహము నెరిగినవాడు క్షేత్రజ్ఞుడుగా పిలువబడును.
కృష్ణకృపామూర్తి
శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి