భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ పదియవ అధ్యాయము - భగవద్విభూతి -శ్లోకము - 10.34
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
హరే కృష్ణ॥
భగవద్గీత - యధాతథము
_రోజుకు ఒక శ్లోకము_
పదియవ అధ్యాయము
భగవద్విభూతి
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
శ్లోకము - 10.34
మృత్యు: సర్వహరశ్చాహముద్భవశ్చ భవిష్యతామ్ ।
కీర్తి: శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతి: క్షమా ॥
అనువాదము
నేను సమస్తమును మ్రింగి వేసే మృత్యువును, జన్మించబోయే సమస్తానికీ నేనే ఉత్పత్తి కారణమును. స్త్రీలలోని యశస్సు ,ఐశ్వర్యము, మనోహరమైన వాక్కు, జ్ఞాపకశక్తి,బుద్ధి, దృఢత్వము, ఓర్పు నేనే.
కృష్ణకృపామూర్తి
శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya).
Like,share,subscribe
రిప్లయితొలగించండిComment హరే కృష్ణ 🚩🙏🕉️