శ్రీవారి మెట్టు వద్ద ఇచ్చే దివ్యదర్శనం టోకెన్ల జారీ కౌంటర్లు తాత్కాలికంగా మార్పు

 


శ్రీవారి మెట్టు వద్ద ఇచ్చే దివ్యదర్శనం టోకెన్ల జారీ కౌంటర్లు తాత్కాలికంగా మార్పు
......................
...............................
శ్రీవారి దర్శనార్థం శ్రీవారి మెట్టువద్ద నుండి కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తులకు దివ్యదర్శనం టోకెన్ల జారీ కౌంటర్లను తాత్కాలికంగా శ్రీవారి మెట్టు వద్ద నుండి  అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ కి మార్చాలని Ṭటీటీడీ నిర్ణయించింది. శుక్రవారం (జూన్ 6 - 2025) సాయంత్రం నుండి అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో  ఈ మేరకు ఈ నూతన కౌంటర్లు  అందుబాటులోకి రానున్నాయి.

ఇదే అంశానికి సంబంధించి టిటిడి ఈవో శ్రీ జె. శ్యామలరావు మంగళవారం సాయంత్రం వర్చువల్ సమావేశం ద్వారా టీటీడీ అధికారులతో సమీక్షించారు . సమావేశం లోని కొన్ని ముఖ్య అంశాలు:

* ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన ఇస్తారు

* దివ్యదర్శనం టోకెన్లు పొందిన భక్తులు శ్రీవారి మెట్టులోని 1200వ మెట్టు దగ్గర తమ ఆధార్ చూపించి స్కాన్ చేసుకోవాలి.

 శుక్రవారం టోకెన్లు పొందిన వారికి శనివారం దర్శనం కల్పిస్తారు

*  ఇదే సమయంలో మరోపక్క ఎస్ ఎస్ డి టోకెన్లను కూడా అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో వాటి కొరకు నిర్దేశించిన కౌంటర్లలో అందిస్తారు.


....................

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు