భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ పదవ అధ్యాయము - శ్లోకం - 10.4-5
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
హరే కృష్ణ॥
భగవద్గీత - యధాతథము
_రోజుకు ఒక శ్లోకము_
పదియవ అధ్యాయము
భగవద్విభూతి
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
శ్లోకము - 10.4-5
బుద్ధిర్జ్ఞానసమ్మోహ: క్షమా సత్యం దమ: శమ: ।
సుఖం దు:ఖం భవోయభావో భయం చాభయమేవ చ ॥
అహింసా సమతా తుష్టిష్టపో దానం యశోధ్యయశ: ।
భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధా: ॥
అనువాదము
బుద్ధి, జ్ఞానం, సందేహము మోహము లేకపోవడము, క్షమాగుణము, సత్య సంధత, ఇంద్రియనిగ్రహము, మనోనిగ్రహము, సుఖదుఃఖాలు, జన్మము, మృత్యువు, భయము, భయరాహిత్యము,అహింస, సమ భావము,సంతుష్టి,తపస్సు,దానము, యశస్సు,అపకీర్తి మున్నగు జీవుల ఈ వివిధ గుణాలు నా చేతనే సృష్టించబడినాయి.
కృష్ణకృపామూర్తి
శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya).
Like,share,subscribe
రిప్లయితొలగించండిహరే కృష్ణ