జయమంగళము నీకు సర్వేశ్వరా

 




తాళ్లపాక అన్నమాచార్య

రాగము: గుండక్రియ

జయమంగళము నీకు సర్వేశ్వరా

జయమంగళము నీకు జలజవాసినికి ॥పల్లవి॥

శరణాగతపారిజాతమా

పొరి నసురలపాలి భూతమా

అరుదయున సృష్టికి నాదిమూలమా వో-

హరి నమో పరమపుటాలవాలమా ॥జయ॥

సకలదేవతాచక్రవర్తి

వెకలివై నిండిన విశ్వమూర్తి

అకలంకమైన దయానిధి

వికచముఖ నమో విధికి విధి ॥జయ॥

కొలచినవారల కొంగుపైఁడి

ములిగినవారికి మొనవాఁడి

కలిగిన శ్రీవేంకటరాయా

మలసి దాసులమైన మాకు విధేయా ॥జయ॥

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు