సింగిల్ ఫీడర్ తో సమస్యలు ఎదుర్కొంటున్న రైతులు!!

 





లో కరెంట్ రావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్న  రైతులు!!


హసన్ పర్తి, పెంబర్తి గ్రామ పరిధిలో గత నెల రోజులుగా లో వోల్టేజ్ సమస్యతో స్థానిక రైతులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.. తమ పంట పొలాలకు నీరు అందక ప్రతీ పది నిముషాల కోసారి స్టార్టర్ లు పడిపోవడం తో వ్యవసాయ మోటార్ లు కాలిపోతున్నాయని,  వేలకు వేలు ఖర్చు పెట్టి తిరిగి తమ మోటార్ లు బావు చేసుకున్నా తిరిగి అదే సమస్య రావడంతో స్థానిక రైతులు తలలు పట్టు కుంటున్నారు..తమ పంట పొలాలకు చాలి చాలని నీటి సరఫరా తో పంట నష్టము వస్తుందని దీనికి నష్ట పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు..విద్యుత్ అధికారులకు ఎన్నో మార్లు  విజ్ఞప్తి చేసిన పట్టించుకోకపోవడం తో రైతులు తమ గోడు ను అర్థం కోవట్లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. దయచేసి ఈ సమస్య పై దృష్టి సారించాలని మరియు విద్యుత్ అధికారుల అలసత్వం వల్ల నష్టము ఎదుర్కొంటున్న  రైతులకు తగిన నష్ట పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు.దీనిపై ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు కూడా జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు