భగవద్గీత - యధాతథము
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
హరే కృష్ణ॥
_రోజుకు ఒక శ్లోకము_
ఐదవ అధ్యాయము
_కర్మయోగము కృష్ణభక్తిభావనలో కర్మ_
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
శ్లోకము - 5.6
సన్న్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః |
యోగయుక్తో మునిర్ర్బహ్మ న చిరేణాధిగచ్ఛతి ॥
అనువాదము
భగవంతుని భక్తియుతసేవలో నెలకొనకుండ కేవలము సమస్త కర్మలను సన్న్యసించడం మనిషిని సుఖవంతునిగా చేయలేదు. కాని భక్తియుతసేవలో నెలకొనిన ముని శీఘ్రమే పరబ్రహ్మమును పొందుతాడు.
కృష్ణకృపామూర్తి
శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి