భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ ఐదవ అధ్యాయము-శ్లోకము - 5.8-9

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥




 _కర్మయోగము కృష్ణభక్తిభావనలో కర్మ_ 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸



నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్త్వవిత్ |

పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్నశ్నన్ గచ్ఛన్ స్వపన్ శ్వసన్ ||

 ప్రలపన్ విసృజన్ గృహన్నున్మిషన్నిమిషన్నపి ।

 ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్ ॥


అనువాదము


దివ్య చైతన్యంలో ఉన్న వ్యక్తి చూడడం, వినడం, తాకడం, వాసన చూడడం, తినడం, నడవడం, నిద్రపోవడం, శ్వాసించడం వంటివి చేస్తున్నప్పటికిని నిజానికి తానేమీ చేయట్లేదని తనలో తాను సర్వదా ఎరిగి ఉంటాడు. ఎందుకంటే మాట్లాడుతున్నప్పుడు, వినర్జిస్తున్నప్పుడు, తీసికొంటున్నప్పుడు లేదా కళ్ళు తెరిచినపుడు, మూసికొన్నప్పుడు ఇంద్రియాలు తమకు సంబంధించిన విషయాలలో నెలకొని ఉన్నాయని, తాను వాటికి దూరంగా ఉన్నానని అతడు సర్వదా ఎరిగి ఉంటాడు.


కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు