భగవద్గీత - యధాతథము_రోజుకు ఒక శ్లోకము_ ఐదవ అధ్యాయము-శ్లోకము - 5.3
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
హరే కృష్ణ॥
_కర్మయోగము కృష్ణభక్తిభావనలో కర్మ_
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
జ్ఞేయః స నిత్యసన్న్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి |
నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే ||
అనువాదము
తన కర్మఫలాలను ద్వేషించనివాడు, కోరనివాడు నిత్యసన్న్యాసిగా తెలియబడతాడు. మహాబాహువులు కలిగిన అర్జునా! సకల ద్వంద్వాల నుండి విడివడిన అటువంటి వ్యక్తి భౌతికబంధాన్ని సులభంగా దాటి పూర్తిగా ముక్తుడౌతాడు.
కృష్ణకృపామూర్తి
శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి