టాటా అంటే నే ట్రస్ట్, ట్రస్ట్ అంటేనే టాటా!!!!
నేను మాత్రమే ఎదగాలని అనుకుంటే రతన్ టాటా గారు అంబానీ, అదానీ లను మించే వారు కాని అలా జరుగలేదు.. నాతో పాటు ఎంతో మంది ఎదగాలని అనుకునేవారు.. అనుక్షణం పరితపించేవారు,మన దేశం గొప్ప ఆర్థిక శక్తి గా ఎదగాలంటే నిరుపేద,బీద, మద్య తరగతి వారిని సరైన విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపరచటమే పరమావధిగా టాటా ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎంతో మంది కి ఆసరా అయ్యాడు.. సొంత లాభం కొంత మానుకొని పొరుగువాని కి తోడ్పడవోయ్ అన్న మాట కు నిలువెత్తు నిదర్శనం రతన్ టాటా...
ప్రభుత్వం చేయలేని ఎన్నో సేవా కార్యక్రమాలు
రాజకీయ నాయకుడు చేయలేని ఎన్నో పథకాలు సామాన్య ప్రజలకు ఆయన అందజేసినారు...
అవినీతి, అక్రమాలతో వ్యాపారాలు చేసి బ్యాంక్ లు లూటీ చేసి విదేశాలకు పారిపోయిన వ్యాపారులు ఉన్న ఈ దేశంలో నీతి, నిజాయితీ, పారదర్శకత, సచ్చీలత, అచంచల దేశ భక్తి, దేశ ప్రజలంటే మమకారం కలిగిన ఒక కార్పోరేట్ వ్యాపార వెలుగుతార,దిక్సూచి రతన్ టాటా గారు
వారు మన మద్య భౌతికంగా లేక పోవచ్చు కానీ వారు వేసిన బాట ప్రతీ భారతీయుడు ఆచరించదగ్గది....
వ్యాపారి అంటే కేవలం లాభము నష్టము మాత్రమే కాదు సేవాభావం అని తన టాటా ట్రస్ట్ ద్వారా తెలిపారు
వారి హృదయము ప్రతి భారతీయుడి గుండెల్లో పదిలం!!!
వారు ఎక్కడున్నా వారి ఆత్మ కు భగవంతుడు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ
*వైకుంఠ దర్శన ప్రాప్తిరస్తు!!!*
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి