రియల్ ఎస్టేట్స్ రంగాన్ని ముఖ్యమంత్రి గారు ఆదుకోవాలి.!!!
ఐసీయూ అవస్థలో ఉన్న రియల్ ఎస్టేట్స్ రంగాన్ని ముఖ్యమంత్రి గారు ఆదుకోవాలి. అక్టోబర్ 26న జరిగే మంత్రివర్గ సమావేశంలో రియల్ ఎస్టేట్స్ రంగము గురించి చర్చ జరగాలి. ఈరోజు బంగారు తెలంగాణ రియల్ ఎస్టేట్స్ మార్కెటింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ అన్సార్ హుస్సేన్ గారు కార్యవర్గ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ కొన్ని వార్తాపత్రికలలో హెచ్ఎండిఏ అధికారులు 532 గ్రామ పంచాయతీ లేఔట్స్ ను నిషేధిస్తున్నట్లు వార్తలువచ్చాయి వాటిపై ప్రభుత్వము స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అని చెప్పారు గత 30 నుండి 40 సంవత్సరాల కింద చేసిన గ్రామపంచాయతీ లేఔట్స్ ను ఏ విధంగా నిషేధిస్తారని ప్రశ్నించారు. హెచ్ఎండిఏ పుట్టక ముందు నుండి గ్రామపంచాయతీ లేఔట్స్ ఉన్నాయని అలాంటి గ్రామపంచాయతీ లేఔట్స్ పై హెచ్ఎండిఏ ఏ విధంగా నిషేధిస్తుంది హెచ్ఎండిఏ కు ఆ అధికారం ఎక్కడిది అని ఆయన అన్నారు 2007 నుండి 2012 సంవత్సరములో యల్లారెస్ బి ఆర్ ఎస్, స్కీం ల ద్వారా ప్రభుత్వానికి కొన్ని కోట్ల రూపాయల ఆదాయం సమకూరిందని అలాంటి రెగ్యులరైజ్ చేసిన కాగితాలు చిత్తుకాగితాలేనా అని ప్రభుత్వాన్ని కోరారు. ఉచితంగా ఎల్ఆర్ఎస్,బి ఆర్ ఎస్ చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ఇప్పటి ప్రభుత్వము ఆ హామీని అమలు చేయక ఎల్ఆర్ఎస్ బి ఆర్ ఎస్ పేరుతో పేద ప్రజలపై భారము మోపడం సరికాదన్నారు. ప్రభుత్వం కేవలం 100 నుండి 200 చదరపు గజముల ప్లాట్లకు కేవలం 5000/-రూపాయలు చాలన్ల రూపంలో తీసుకొని ఫ్లాట్లను రెగ్యులరైజ్ చేసి పేద మరియు సామాన్య మధ్యతరగతి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపి ఇది నిజమైన ప్రజాప్రభుత్వం అని నిరూపించుకోవాలని కోరారు. గ్రామపంచాయతీ లేఔట్స్ పై మిగిలి ఉన్న ప్లాట్లను వెంటనే రిజిస్ట్రేషన్ ల ప్రక్రియ ప్రారంభించి చిన్నా మధ్యతరగతి రియాల్టర్లను ఆదుకోని చూపించాలని కోరారు. ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ రంగం ద్వారా దాదాపు 22 నుంచి 25 శాతం ఆదాయం సమకూరుతుంది కాబట్టి ఈ రంగంపై దృష్టి సాధించాలని కోరారు. హైడ్రా విషయంలో పేద మరియు మధ్యతరగతి ప్రజల్లో భయాందోళనలు నెల కొన్ని ఉన్నాయని పేద ప్రజలు ఎంతో భయాందోళనకు గురవుతున్నారని వారికి నష్టం జరిగితే సహించేది లేదని తెలిపారు. పై సమస్యలపై వెంటనే స్పందించాలని లేనియెడల మా కార్యచరణను ప్రకటించి ప్రజలు చిన్నచిన్న రియాల్టర్లు మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లా సంక్షేమం కొరకు ఎంతటి పోరాటం చేయడానికి అయినా బంగారు తెలంగాణ రియల్ ఎస్టేట్స్ మార్కెటింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అందరూ ముందు ఉంటారని చెప్పారు ఈ కార్యక్రమంలో మహబూబ్నగర్ రియల్ ఎస్టేట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ అహమ్మద్ అలీ గారు, జిల్లా అధ్యక్షులు బాబు నాయక్ గారు, పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు గారు, భాను ప్రతాప్ గారు, చికిరాల శ్రీనివాస్ గారు, తదితర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి