అంతర్వేది పవిత్రోత్సవాలకు అహోబిలం లో ప్రత్యేక పూజలు ...








తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి వారి పవిత్రోత్సవాలకు వినియోగించే పవిత్ర మాలలను అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం  అంతర్వేది తీసుకువెళ్లారు.శ్రీ అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి పవిత్రోత్సవాలు పవిత్ర మాలలకు గత కొన్ని సంవత్సరాల నుండి  రంగారావు గోష్టి సభ్యుల తరపున పవిత్రమాలను  శ్రీ అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి పాదాల చెంత ఉంచి ఆ పవిత్రమాలను అంతర్వేది అర్చకులకు అందజేయడం ఆనవాయితీగా జరుగుచున్నది.   

ఈ కార్యక్రమంలో అహోబిలం దేవస్థానం ముద్రకర్త, ప్రధాన అర్చకులు శ్రీ కిడాంబి వేణుగోపాలచార్యులు, మనియర్ సౌమ్య నారాయణన్ స్వామి,,భార్గవస్వామి,శ్రీవత్సవ స్వామి,మారన్ శఠగోపన్ స్వామి,లక్ష్మీ నరసింహ చార్యులు

మరియు  శ్రీ అంతర్వేది దేవస్థానం  శ్రీ సుదర్శనమ్ రమేష్ స్వామి ( ముఖ్య అర్చక )  పవిత్రమాలలను అందచేశారు.


ఈ కార్యక్రమంలో  రంగారావు గోష్టి సభ్యులు శ్రీ AD D.రవికాంత్ చౌదరి,ఉప్పల ప్రసాదు, M వీరచంద్ర, సుబ్రహ్మణ్యం, శేషునాయక్, వెంకీ, త్రిలోక్ పాల్గొన్నారు.



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు