జయ జయ శుభకర వినాయక సాంగ్ లిరిక్స్
వకృతుండ మహాఖాయ.. కోటి సూర్యసమప్రభ..
నిర్విఘ్నం కురుమేదేవా.. సర్వకార్యేషు సర్వదా..
జయ జయ శుభకర వినాయక - శ్రీ కాణిపాక వర సిద్ది వినాయక !
జయ జయ శుభకర వినాయక - శ్రీ కాణిపాక వర సిద్ది వినాయక !
బాహుదా నది తీరములోన.. బావిలోన వెలసిన దేవ..
మహిలో జనులకు మహిమలు చాటి, ఇహపరములనిడు మహానుభావ
ఇష్టమైనదీ వొదిలిన నీ కడ, ఇష్టకామ్యములు తీర్చే గణపతి
కరుణను కురియుచు, వరముల నొసగుచు, నిరతము పెరిగే - మహాకృతి
సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి
నీ గుడి లో చేసే - సత్య ప్రమాణం, ధర్మ దేవతకు నిలుపును ప్రాణం
విజయ కారణం, విఘ్న నాశనం - కాణిపాకమున నీ దర్శనం !!
జయ జయ శుభకర వినాయక - శ్రీ కాణిపాక వర సిద్ది వినాయక !
జయ జయ శుభకర వినాయక - శ్రీ కాణిపాక వర సిద్ది వినాయక !
పిండి బొమ్మవై ప్రతిభ చూపి - బ్రహ్మాండ నాయకుడివైనావు
మాతా పితలకు ప్రదక్షిణముతో మహా గణపతిగ మారావూ
భక్తుల మొరలాలించి, బ్రోచుటకు - గజముఖ గణపతివైనావు
బ్రహ్మాండమునే బొజ్జలో దాచి - లంబోదరుడవు అయినావు
లాభము, శుభమూ, కీర్తి ని కూర్పగ - లక్ష్మీ గణపతివైనావు
వేద పురాణములఖిల శాస్త్రములు - కళలూ చాటును నీ వైభవం
వక్రతుండమే - ఓంకారమై ... విబుధులు చేసే నీ కీర్తనం !!
జయ జయ శుభకర వినాయక - శ్రీ కాణిపాక వర సిద్ది వినాయక !
జయ జయ శుభకర వినాయక - శ్రీ కాణిపాక వర సిద్ది వినాయక !
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి