యోటా ఇన్ఫ్రా సంస్థ అధినేత సిఎం తో బేటీ!!!!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డేటా రంగంలో అగ్రగామి ఐన యోటా ఇన్ఫ్రా (Yotta Infra) సంస్థ అధినేత సునీల్ గుప్తా గారు నిన్న మర్యాద పూ ర్వకంగా కలిశారు. హైదరాబాద్ హెచ్ఐసీసీ వేదికగా జరుగుతోన్న ఏఐ గ్లోబల్ సదస్సు ప్రాంగణంలో వీరు సమావేశమయ్యారు. ఏఐ సిటీ అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఏఐ సిటీలో భాగస్వామిగా ఉండేందుకు యోటా ఇన్ఫ్రా ముందుకొచ్చింది. హైదరాబాద్‌లో GPS ఆధారిత AI క్లౌడ్ సేవలను ప్రారంభించడానికి సైతం సిద్ధమవుతోంది. ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు, ఐటీ శాఖ ఉన్నతాధికారులు, యోటా ఇన్‌ఫ్రా ప్రతినిధులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి