జిట్టా బాలక్రిష్ణారెడ్డి మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్య మంత్రి
తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి గారి అకాల మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మంచి మిత్రుడిని, సన్నిహితుడిని కోల్పోయానని ఆవేదన చెందారు.
యువతను ఐక్యం చేసి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు జిట్టా అని సీఎం అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వారి కుటుంబసభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి