పోలాల అమావాస్య చరిత్ర!!!!



ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలిచే పర్వం పోలాల అమావాస్య. ఆనాడు కంద పిలకలను పూజిస్తారు తెలుగు మహిళలు. పరమేశ్వరుని వాహనమైన నంది పుట్టినరోజు ఇదే. దేశంలోని కొన్నిప్రాంతాల్లో గో-వృషభ పూజ చేస్తారు. మరాఠీలు ప్రాచీదేవి అనే మాతృశక్తిని పోలాల అమావాస్యనాడు ఆరాధిస్తారు. ఊరి పొలిమేరల్లో కొలువై జీవకోటిని కాపాడే తల్లి పోలేరమ్మ. తమ కుటుంబంతో పాటు పాడిపంటలను, పశువులను, కరుణతో కాపాడమని ఏడాదికోసారి శ్రావణ అమావాస్యనాడు ఆ గ్రామ దేవతకు పూజలు చేస్తుంటారు. గోదావరి తీరవాసులు ఈ పండగను విశేషంగా నిర్వహించు కుంటారు. అందుకే పోలాల అమావాస్యకు గోదావరి పొర్లిపొర్లి వస్తుందనే నానుడి ఏర్పడింది. గో-వృషభ పూజ పోలాల అమావాస్య నాటికి. వరినాట్లు పూర్తికావడంతో ఎద్దులకు విశ్రాంతి దొరుకుతుంది. ఆ సమయంలో వాటిని బాగా మేపి పూజించే ఆచారం ఏర్పడి ఉంటుంది. ఆవుల్ని కూడా పూజిస్తారు. కడుపు చలవ సంతానంలేని వారికి పోలేరమ్మ సంతానాన్నిస్తుందని, సంతానం కలిగినవారికి కడుపు చలవ చేస్తుందని స్త్రీలు నమ్ముతారు. పోలాంబ వ్రతం చేస్తారు. దీనివల్ల పిల్లకు అకాల మృత్యుభయం ఉండదని, బాలారిష్ట దోషాలు తొలగిపోతాయంటారు. ఈ పోలకమ్మ తోరాన్ని పోలకమ్మ పుస్తి అని కూడా పిలుస్తారు. ఈ వ్రతాన్ని దృష్టిలో ఉంచుకుని "నీ కడుపు కంద పెరడు కాను " అనే నానుడి ఏర్పడింది.



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు