భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ రెండవ అధ్యాయము-శ్లోకము - 2.42-2.43

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥



 _గీతాసారము_ 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


యామిమాం పుష్పితాం వాచం ప్రవదన్త్యవిపశ్చితః |

 వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః ॥


కామాత్మానః స్వర్గపరా జన్మకర్మఫలప్రదామ్ |

క్రియావిశేషబహులాం భోగైశ్వర్యగతిం ప్రతి ||


అనువాదము


అల్పజ్ఞానవంతులు స్వర్గలోకప్రాప్తి, ఉత్తమ జన్మము, అధికారము మున్నగువాటి కొరకు నానారకాలైన సకామకర్మలను ఉపదేశించే వేదాల అలంకృత వాక్కులకే అతిగా అనురక్తులౌతారు. ఇంద్రియభోగమును, ఐశ్వర్యవంతమైన జీవితమును కోరుతూ వారు దానికి మించినది వేరొక్కటి లేదని అంటారు.

 

కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు