ఈ నీటికి దారేది???? ఆ దారి కి హద్దు లేవి????
హద్దు లు చెరిపేస్తున్నరు.. దారులు మూసేస్తున్నరు!!!
పునాదులు కట్టి, ఇండ్లు కట్టి దారులు దర్జాగా కబ్జా చేస్తున్నరు!!!!!!
గ్రేటర్ వరంగల్ పరిదిలోని హసన్పర్తి మండల కేంద్రము లో ఆర్టీసీ కాలనీ (కుడా లే అవుట్) నుండి ఆటో కాలనీ కి వెల్లే ప్రదాన దారిని సామాన్యుల బలహీనతే ఆసరాగా కల్లు గప్పి స్వార్థ పూరితంగా కొందరు కబ్జాలు చేస్తున్నరు!!!
ఇదేమిటని ప్రశ్నిస్తే ప్రశ్నించే గొంతు ను మూయిస్తూ స్థానికులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు...
ఇక వివరాల్లోకి వెలితే
గ్రేటర్ వరంగల్ పరిధిలో ఉన్న హసన్పర్తి మండల కేంద్రము, ఆర్టీసీ కాలనీ (కుడా లే అవుట్) సంబంధించిన ప్రజలు నడిచే దారిని స్థానికంగా పెద్ద మనిషి పేరు తో చలామణి అవుతూ ఒకరు ఇటీవల డోజర్ తో హద్దు లు చెరిపేసారు.ఇదేమిటని ప్రశ్నిస్తే నేను చెప్పినట్టు వినాలి కాని ఎదురు మాట్లాడ కూడదు ఒకవేళ మాట్లాడుతే మీకు నడిచే దారి ని ఇవ్వను ..అంటూ విర్రవీగాడు.ఇదే వ్యక్తి గత పది సంవత్సరములు నుండి ఆర్టీసీ కాలనీ పేరు చెప్పి ఆటో కాలనీ, ఆర్ కె వెంచర్, ఎంప్లాయీస్ కాలనీ పేరు లేకుండ అన్ని కాలనీలను ఆర్టీసీ కాలనీ గా ప్రచారం చేస్తూ పదేల్లకిందట ఆర్కే వెంచర్ ను ఏర్పాటు చేసిన వారికి సహకరించి ఆటో కాలనీ నుండి ఆర్టీసీ కాలనీ కి వెల్లే ప్రదాన దారిని మూసేయడానికి అప్పటి వెంచర్ యాజమాన్యం తో చేతులు కలిపి ఆటో కాలనీ లోని మూడు ప్లాట్లు, ముదిరాజ్ కాలనీ లలోని మూడు ప్లాట్లు వీది పోటు చేయడమే కాక ఆటో కాలనీ, ముదిరాజ్ కాలనీ నుండి ఆర్టీసీ కాలనీ కి(కుడా లే అవుట్) వెల్లే ప్రదాన దారిని మూసేసి చేతులు దులుపుకున్నాడు.. మరియు ఇటీవల ఆ దారి లో బిల్డింగ్ కూడా నిర్మించిన వారికి సహకరించి , అటు ఆర్టీసీ కాలనీ కి వెళ్లకుండ ఆర్కే వెంచర్ యాజమాన్యం తో, ఇటు బిల్డింగ్ యాజమాన్యం తో చేతులు కలిపి నల్లగట్టు గుట్ట నుండి వస్తున్న వరద నీటికి అడ్డుకట్ట వేసారు. మరియు కుడా లే అవుట్ దారిని కూడా అక్రమంగా చెదరగొట్టారు.. దీంతో విసిగి పోయిన ఆటో కాలనీ వాసులు మరియు యాజమాన్యం దారిని కబ్జా కానివ్వకుండా దేవాలయం నిర్మాణం కోసం సొసైటీ ఏర్పాటు చేసుకుంది కూడా.. అయితే ఇది గమనించిన ఆ వ్యక్తి ఇదే అదనుగా కబ్జా చేయడం (ఆర్టీసీ కాలనీ నుండి ఆటో కాలనీ,ముదిరాజ్ కాలనీ కి వెల్లే ప్రదాన దారిని కుడా లే అవుట్) చదును చేసారు.దీంతో స్థానికులు మరియు ప్లాట్లు యాజమాన్యం అభ్యంతరము వ్యక్తం చేసారు.. సదరు వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని, మరియు దారికి అడ్డంగా కట్టి న అక్రమ కట్టడాలు కూల్చి వేయాలని మరియు దారిని పరిష్కారం చేయాలని ప్రభుత్వం కు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారి కి విజఙప్తి చేస్తున్నారు.. ఇటీవల హైడ్రా పేరు అక్రమ కట్టడాలు కూల్చేయడం సంతోషించదగ్గ విషయం అని అదే విధంగా దారులు కబ్జాలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, అక్రమ కట్టడాలు కట్టి న వాటిని కూల్చివేసి ఆర్టీసీ కాలనీ నుండి ఆటో కాలనీ కి వెల్లే ప్రదాన దారిని పునరుద్ధరణ చేయాలని కోరుతున్నారు!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి