🙏 కృష్ణం వందే జగద్గురుమ్ 🙏
💁 కృష్ణుడు గురించి ఈ మధ్య కొందరు నీచంగా మాట్లాడుతున్నారు.. హిందువులు ఐయ్యు ఉండి వాళ్ళని తిడుతున్నారు కానీ అసలు విషయం వీళ్లకే తెలియదు..ఇతర మతస్తుల ను చూసి అయినా మారండి..దేవి దేవతల గొప్పతనం పిల్లలకి నేర్పండి..
1.కృష్ణుడికి 16000 మంది గోపికలు:- కంసుడు చెరలో ఉన్న ఈ ఆడవాళ్ళని కంసుడి మరణం తర్వాత తిరిగి వారి కుటుంబ సభ్యులు వీళ్ళని ఇంట్లోకి తిరిగి రానివ్వలేదు,పతిత అని ముద్ర వేస్తారు..అందుకు ఆ ఆడవాళ్ళంతా చనిపోవడానికి సిద్ధ పడతారు..అప్పుడు కృష్ణుడు వచ్చి వారిని కాపాడి ఇక నుండి వారిని తన భార్యలు గా చెప్పమని వారికి ఒక హోదా నీ కల్పించాడు.
2.కృష్ణుడికి 8 మంది భార్యలు:- మహాభారతంలో కీలక పాత్ర కృష్ణుడి దే అని అందరికీ తెల్సు ..తెల్సా ఇదైనా?
మహా భారతాన్ని ముందుకు నడపాలి అంటే ముందు వాళ్ళ బంధువు అవ్వాలి వారిలో ఒకడు అవ్వాలి అందుకే వాళ్ళ బంధువుల అమ్మాయిలని వివాహం చేసుకున్నాడు..అది కూడా వారే దేవుడికి తమ పిల్లలని ఇవ్వాలని ఒప్పించి చేశారు..అది జగన్నాటక సూత్ర దారి ప్లాన్
3.ఆడవాళ్ళతో సరసాలు:- 6 ఏళ్ల వయసులో చేసేది సరసం అవుతుందా? ఆ చిన్న వయసులో వెన్న దొంగ గా మారాడు..గడుసు అత్తలని అల్లరి చేసి వారి తిక్క కుదిర్చాడు, కొంటె కోడళ్ళ భరతం పట్టడు..అన్ని సరదాకే కానీ ఎవర్నీ నొప్పించలేదు.. ఆ వయసు పిల్లలు మనతో అలా ఉంటే ముచ్చట పడతామా లేక అమ్మో వీడు కామాంధుడు సరసం ఆడుతున్నాడు అంటామా?
4.రాధ క్రిష్ణ:- కృష్ణుడి తొలి ప్రేమ రాధ..కర్తవ్యం గుర్తు వచ్చాక ప్రేమని త్యాగం చేయక తప్పలేదు..రాధ ప్రేమ గొప్పదా కృష్ణ ప్రేమ గొప్పదా అంటే రాధ ప్రేమ గొప్పది..ఎందుకంటే కృష్ణుడికి అందరూ సమానమే..తనని ఎవరు అమితంగా ప్రేమిస్తారో వారిని గుండెల్లో నింపుకుంటాడు..కానీ రాధ కృష్ణుడి కోసం చూస్తూ అలా మిగిలిపోయింది.
5.కృష్ణుడు అస్ఖలిత బ్రహ్మచారి:- అవును..16వేల మంది గోపికలు,8 మంది భార్యలు ఉన్నా ఆయన బ్రహ్మచారీ..
అవును అస్ఖలిత బ్రహ్మచారులు చాలా అరుదుగా ఉంటారు..అందులో మొదటి వాడు కృష్ణుడు..అస్ఖలిత అంటే బూతు లోకి వెళ్ళకండి ..దాని అర్థం ..స్త్రీ పై ఎటువంటి కామ కోరిక లేని వాడు కనీసం ఊహల్లో,ఆలోచనలో కూడా స్త్రీ పై వ్యామోహం కలగని వాడిని అస్ఖలిత బ్రహ్మచారి అంటారు..అందుకు చిహ్నం గానే ఆయన నెమలి ఈకని తలపై ధరించాడు..నెమలి సంభోగం జరపని ఏకైక పక్షి కనుక.
6.చివరగా కృష్ణుడు స్త్రీ లోలుడు కాదు..ఆయన జన్మ కారణం లోకకళ్యాణం కోసం..మహాభారతం కోసం..మంచి చెడు ల మధ్య జరిగే ఒక మహా అద్భుతాన్ని మనకి చూపించి దర్మమైన మార్గాన్ని నడవమని చెప్పడానికే..
7.ఆయన భక్తి కి మాత్రమే బానిస అందానికి ,ఆస్తులకు కాదు అని చెప్పడానికే శ్రీ కృష్ణ తులా భారం జరిగింది..
8.పెద్ద పెద్ద వాళ్ళు ఆయన కోసం ఎదురు చూస్తున్నా..ఏమి లేని కుచెలుడి తో స్నేహం చేసి తనతో సమయం గడుపుతాడు..
సేకరణ.
🙏 కృష్ణం వందే జగద్గురుమ్ 🙏
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి