రైతన్న కు న్యాయమేది????
దేశానికి అన్నం పెట్టే రైతన్న కు రాష్ట్ర ప్రభుత్వం కాని కేంద్ర ప్రభుత్వం కాని ప్రభుత్వ ఉద్యోగం తరహాలో పర్మినెంట్ ఉద్యోగం ఎందుకు ఇవ్వ కూడదు????
ప్రభుత్వ ఉద్యోగం చేసే వారికి తండ్రి పోతే కొడుకు, కోడుకు పోతే మనమడు అంటూ వారసత్వ ఉద్యోగాలు ఇస్తూ పర్మినెంట్ ఉద్యోగం ఇస్తుండగా లేనిది దేశానికే అన్నం పెట్టే రైతన్న కు పర్మినెంట్ ఉద్యోగం ఎందుకు ఇవ్వ కూడదు???
ప్రభుత్వం ఉద్యోగులకు నెలకు సరిగ్గా పని చేసినా పని చేయకపోయినా నెలవారీ జీతాలు పడుతాయి కాని ఆరుగాలం కష్టము చేసి దేశానికి తిండి పెట్టి న రైతన్న కు మాత్రము ఎల్లప్పుడును జీతాలు ఉండవు.. ఎందుకు❓❓
ప్రభుత్వ ఉద్యోగం చేసే వారికి ఉద్యోగం దిగిపోయాక కూడా రిటైర్ మెంట్ పెన్షన్ లు, ఆ పెన్షన్ లు అంటూ పని చేయక పోయినా వారు చచ్చేంత వరకు పడుతూనే ఉంటాయి కాని రైతన్న లకు మాత్రము అవి ఉండవు.. ఎందుకు❓❓❓❓
ఇచ్చే జీతాలు చాలవు అంటూ
ఇంకా కావాలి ఇంకా ఇంకా కావాలి డిమాండ్ లు చేస్తరు ప్రభుత్వ ఉద్యోగులు...వాల్ల డిమాండు లు అర్థం చేసుకోగా లేనిది రైతన్న సమస్యలు ప్రభుత్వం ఎందు కు అర్థం చేసుకో కూడదు...❓
ఇచ్చిన జీతాలు చాలవు అంటూ, సరిగా పనిచేయడం పక్కకు పెట్టి
లంచాలకు కక్కుర్తి పడి అవినీతి కి కేరాఫ్ అడ్రస్ గా కోందరు ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే కాయ కష్టం చేసి, ఎండనక వాననక పొలాల్లో జీవనం సాగిస్తూ నిజాయితీగా దేశానికి అన్నం పెడుతూ నిరుపేద గా బతుకుతున్నడు మన రైతన్న...
మరి వారి కి సరైన గుర్తింపు ఇంతవరకు రాలేదు ఎందుకు❓❓❓❓❓❓❓❓
ఒక ప్రభుత్వం *మాదిరైతన్న ప్రభుత్వం* అంటుంది
ఇంకో ప్రభుత్వం *రైతే రాజు* అంటుంది
మరో ప్రభుత్వం *జై కిసాన్* అంటుంది
కాని భారతదేశంలో స్వాతంత్ర్యము వచ్చి 75 ఏల్లు గడుస్తున్న కూడా ఏ ప్రభుత్వం కూడా రైతన్న లకు సరియైన న్యాయము చేయలేదు!!!
ఇది వాస్తవం కాదా????
అవినీతి పరు లైన వారికి, బ్యాంకు లు దోపిడీ చేస్తున్న గజ దొంగలుకు,భూ కబ్జాలు చేస్తుూ వందలు వేలు ఎకరాలు సంపాదించుకున్న వారికి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానం పలుకగా లేనిది నిజాయితీగా కష్టము చేసి దేశానికి తిండి పెడుతున్నడు మరి వీరిపై ప్రభుత్వం ఎందుకు దృష్టి సారించకూడదు???
మీకు అన్నం పెట్టేది రైతన్న
మీ ఎమ్మెల్యే లకు, ఎంపీలకు,కార్పొరేటర్లు, సర్పంచులకు,మంత్రి లకు అన్నం పెట్టేది రైతన్న
మీ ప్రభుత్వ ఉద్యోగులకు వారసత్వ ఉద్యోగం ఇస్తే తరతరాలుగా అన్నం పెట్టే ది రైతన్న!!!
ఈరోజు మీరు మీ కొడుకులు కూతుళ్లు దర్జాగా ఏసి కార్లలో తిరుగు తూ, ప్రశాంతంగా ఏసి ఇళ్లల్లో బతుకుతూ మంచి తిండి తింటుూ బతుకుతున్నారంటే దానికి కారణం రైతన్న!!!!
ఆఖరికి అంబా నీ, అదానీలకు, మాల్యాలు, నీరవ్ మోడీ లాంటి లక్షల కోట్లు బ్యాంకు రుణాలు తీసికొని ఎగ్గోట్టి దేశం విడిచి పారిపోయిన వారికి తిండి పెట్టేది కూడా రైతన్న!!!
కాని రైతన్నకు సరైన గౌరవం స్వాతంత్ర్యము వచ్చి 75 ఏల్లు గడుస్తున్న దక్కటం లేదు!!!
కుటుంబం పోషించే వాడు తండ్రి ఐతే దేశంలో ని ఎన్నో కోట్ల కుటుంబాలను పోషించే రైతన్న ఏం కావాలి??????
రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది...
రైతు అభివృద్ధి ఐతే నే దేశం అభివృద్ధి అవుతుంది...
ప్రభుత్వం ఆలోచన చేయాలి!!!
*జై కిసాన్!!*
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి