కార్యకర్త కుటుంబానికి అండగా బిఅర్ఎస్ పార్టీ
పార్టీ ఇన్సూరెన్స్ ద్వారా మంజూరు అయిన 2 లక్షల చెక్కును మృతుడి కుటుంబానికి అందజేసిన అరూరి
హసన్ పర్తి మండలం జయగిరి గ్రామానికి చెందిన బి అర్ ఎస్ పార్టీ కార్యకర్త పోగుల బిక్షపతి గత యేడాది ప్రమాదవశాత్తు పొలం లో పడి మృతి చెందగా బిఅర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ ద్వారా మంజూరు అయిన 2 లక్షల రూపాయల చెక్కును స్వయంగా వారి గృహానికి వెళ్లి వారి కుటుంబానికి అందజేసిన బి అర్ ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి రమేష్ గారు..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బి అర్ ఎస్ కార్యకర్త బిక్షపతి గారు ప్రమాదవశాత్తు చనిపోవడం బాధాకరమని వారి కుటుంబాన్ని పార్టీ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని వారికి భరోసా ఇవ్వడం జరిగింది అందుకే బి అర్ ఎస్ పార్టీ ద్వారా మంజూరు అయిన 2 లక్షల రూపాయల చెక్కును వారి కుటుంబానికి అందజేయడం జరిగింది అన్నారు... కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటు వారి కష్ట సుఖాల్లో తోడుగా ఉంటున్న ఏకైక పార్టీ బి అర్ ఎస్ పార్టీ అని అన్నారు..అధికారం ఉన్న లేకపోయినా పార్టీ కోసం పార్టీ కార్యకర్తల కోసం తాను ఎల్లపుడూ వెన్నుదన్నుగా ఉంటానని అన్నారు....
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బండి రజిని కుమార్,వైస్ ఎంపిపి రత్నాకర్ రెడ్డి,పాక్స్ ఛైర్మన్ రమేష్ గౌడ్,మండల సర్పంచులు ఫోరం అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి,మాజి సర్పంచ్ రాజు,ఎంపిటిసి చంద్ర కుమార్,మాజి జెడ్పీటీసీ సుభాష్,గ్రామ శాఖ అద్యక్షుడు కుమారస్వామి,మాజి సర్పంచ్ అశోక్,నాయకులు వెంకటేశ్వర రెడ్డి,మనింద్రా నాథ్,రమేష్ గౌడ్,రాజు,బిక్షపతి,రాజ్ కుమార్,బాబు, తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి