నాయకులు వస్తారు పోతారు కార్యకర్తలే ఎప్పటికీ శాశ్వతం - అరూరి రమేష్

 











 నాయకులు వస్తారు, పోతారు కానీ కార్యకర్తలే శాశ్వతం వారే బిఅర్ఎస్ పార్టీ కి బలం అని అన్నారు బిఅర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి రమేష్ గారు...ఐనవోలు పార్టీ  క్యాంపు కార్యాలయంలో ఐనవోలు మండల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు..

 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....


👉 ఎవరు అదైర్య పడొద్దు,కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా.వారి కష్ట సుఖాల్లో అండగా ఉంటా.


👉 నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసిన మన పార్టీ నాయకుల కొంతమంది వెన్నుపోటు దారుల వల్ల మనం ఓడిపోవడం జరిగింది..


👉 అందరూ పార్టీ లు మారుతున్నారని కుంగి పోవాల్సిన అవసరం లేదు..


👉  పార్టీలో ఉండి  ఎన్నో పదవులు అధిరోహించి కన్నతల్లి లాంటి పార్టీ నీ వదిలి వెళ్ళడానికి మీకు మనసు ఎలా వచ్చింది?


👉  నా ఎనికల్లో నాకు వ్యతిరేకంగా పనిచేసి నా ఓటమికి కారణమయ్యారు.అయిన కూడా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేశాను అంతే కానీ మీలాగా వెన్నుపోటు రాజకీయాలు చేయలేదు..


👉 వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు బాగుండాలని రాత్రి పగలు తేడా లేకుండా కుటుంబాన్ని సైతం పక్కన బెట్టి  కష్ట పడి పని చేసిన వ్యక్తిని నేను.


👉 ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని నిలబడ్డాను..


👉 10 మంది పోతే 100 మంది కార్యకర్తలను తయారుచేయగలిగే సత్తా ఉన్న పార్టీ మన బి అర్ ఎస్ పార్టీ..


👉 ఎంత మంది పార్టీ విడిచి వెళ్లిన వేల సంఖ్యలో పార్టీకోసం కష్టపడే కార్యకర్తలు నియోజకవర్గంలో చాలా మంది ఉన్నారు..


👉 మీరు ఎన్ని కుట్రలు చేసినా వర్దన్నపెట నియోజకవర్గ ప్రజల గుండెల్లో సంపాదించిన నా స్థానాన్ని దూరం చేయలేరు. 


👉 తిరిగి పుంజుకుoటాము, పార్లమెంట్ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేద్దాం.


👉 పార్లమెంట్ టికెట్ ఎవరికిచ్చిన కష్ట పడి పార్టీ బలోపేతానికి కృషి చేద్దాం.


👉మన  నియోజకవర్గం లో అత్యధిక మెజారిటీ ఇద్దాం.


👉మన పార్టీ కార్యకర్తలకు కష్టం వస్తే అందరం ఒకటి కావాలి


👉  జిల్లాలో మరియు నియోజకవర్గంలో  పార్టీ బలోపేతం పై ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని ముందుకు వెళ్దాం...


ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ శ్రీరాములు,కో ఆప్షన్ సభ్యులు ఉస్మాన్ అలీ,వైస్ ఎంపిపి మోహన్,మాజి దేవస్థాన చైర్మన్ జైపాల్ యాదవ్, మండల కో ఆప్షన్ సభ్యులు గుంశావలి,అత్మ డైరెక్టర్లు రాజు,మండల ఎంపిటిసి ఫోరం ల అద్యక్షులు సోమేశ్వర రావు,మండల ప్రచార కార్యదర్శి కొమలత,మండల రైతు విభాగం అధ్యక్షుడు రాఘవులు, యూత్ అద్యక్షులు నరేష్,నాయకులు సతీష్, విక్రం, లక్ష్మణ్ గౌడ్ భాస్కర్,శ్రీను భిక్షపతి,గ్రామాల సర్పంచులు,గ్రామ శాఖ అద్యక్షులు  కార్యకర్తలు పాల్గొన్నారు...

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు