-అత్యంత వైభవంగా శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణ-మంత్రి సీతక్క

 












రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సర్వం సిద్దం చేసి, భక్తులకు అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. 4000 వేల మంది పారిశుధ్య కార్మికులు జాతరలో 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్  ద్వారా పరిశీలిస్తామని చెప్పారు 





వీఐపీ , వీవీఐపీ ల దర్శనం  వల్ల సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు .జాతరకు వచ్చే భక్తులకు వైద్యశాఖ నుంచి 30 ప్రత్యేక హెల్త్ క్యాంప్స్ అంబులెన్స్ ను ఏర్పాటు చేశామని  , RTC మహిళ సిబ్బందికి టికెట్ కౌంటర్స్ వద్ద ప్రత్యేక వసతి సదుపాయాలు  ఏర్పాటు,ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో 14 క్లస్టర్, 279 యూనిట్స్ ద్వారా 5,532 టాయిలెట్స్ ఏర్పాటు ,మేడారం మహా జాతరకు  తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్నట్ట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఐఎఎస్ , ఎస్పీ శబరిష్ ఐపీఎస్  ,ఐటిడిఎ పిఓ అంకిత్ ఐఎఎస్ ,అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల) శ్రీజ ,డిఎస్పీ రవీందర్ , పూజరుల సంఘం అధ్యక్షుడు సిద్ధ బోయిన జగ్గారావు దేవాదాయ శాఖ అధికారి రాజేంద్రం  తో పాటు 

వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు






కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు