ఉమ్మడి పౌర స్మ్రుతి(యూసిసి) కలిగిన తొలి రాష్ట్రం ఉత్తరాఖండ్!!!!
దేశంలో ఉత్తరాఖండ్ రాష్ట్రం సరికొత్త చరిత్రను లిఖించడంలో భాగస్వామ్యం అయ్యింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించి ఇటీవలె ఆ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించగా.. యూనిఫాం సివిల్ కోడ్ (యుసిసి)బిల్లును సీఎం పుష్కర్ సింగ్ ధామీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఉమ్మడి పౌరస్మృతి బిల్లు(యుసిసి) ప్రస్తుతం అమలు కావడంతో దేశంలో యూసీసీ ఆమోదం పొందిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. ఉత్తరాఖండ్ రాష్ట్రం కంటే ముందు గోవా రాష్ట్రంలో బ్రిటీష్ పాలకుల కాలంలోనే ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి వచ్చింది.అయితే ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూసీసీ బిల్లుకు సభ ఆమోదం కల్పించడం జరిగింది ఉత్తరాఖండ్‌కు ఇది చాలా ముఖ్యమైన రోజు అని ఉమ్మడి పౌరస్మృతి బిల్లు ఆమోదం సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రజలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న ఈ బిల్లును ఉత్తరాఖండ్ ఆమోదించిందని తెలిపారు. యూనిఫాం సివిల్ కోడ్‌ను ఆమోదించిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచిందని.. ఉత్తరాఖండ్ ప్రజలకు, ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలపాలనుకుంటున్నట్లు పుష్కర్ సింగ్ ధామీ పేర్కొన్నారు. తాము అధికారంలోకి రావడానికి.. ఈ యూసీసీ బిల్లును ఆమోదించడానికి తమకు అవకాశం ఇచ్చారని ముఖ్యమంత్రి వెల్లడించారు.
ఈ సందర్భంగా తమకు మద్దతు ఇచ్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ధన్యవాదాలు తెలిపారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి