రండ గాడు ఎవరు???

 


గౌరవ తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్య మంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి!!


మార్పు రావాలి అనే నినాదం తో మీరు వస్తే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని పాలన లో మార్పు రావాలి అనే సంకల్పం తో ఓటు వేసి తీర్పు ఇచ్చి అధికారాన్ని మీకు అప్పగించారు..కాని ఎన్నికలు ఐపోయి, మీరు అధికారంలోకి వచ్చి 50రోజులు పై మాటే !!!


కానీ ఇప్పటివరకు మీరు ఇస్తామన్న ఆరు గ్యారంటీ ల ఊసే లేదు ...

 మీరు ఉచితాలు ఇస్తున్నారు అని చెప్పారు   మరి మీ జీతాల్లోనించి గాని ,మీ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ ల జీతాలనుంచి గాని లేదా వారి ఆస్తులు అమ్మి ఇస్తున్నారా అన్నదానికి ఇంతవరకు ప్రజాపాలనలో తెలంగాణ ప్రజలకు సమాధానం కూడా లభించలేదు!! 


కాని తెలంగాణలో మీరు అధికారం చేజిక్కించుకోవడానికి

👉 సమాఖ్య ఆంధ్ర షర్మిలక్క అలియాస్ షర్మిలారెడ్డి (దివంగత ముఖ్య మంత్రి వై. ఎస్.రాజశేఖర్ రెడ్డి గార్ల కూతురు) గారి అవసరం మీకు మీ పార్టీ కి అవసరమోచ్చింది!!! 


👉మామను వెన్నుపోటు పొడిచిన అల్లుడు గా పేరు పొంది,తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తుగా ఎగసిన సందర్బం లో *ఆంధ్ర, తెలంగాణ లు నాకు రెండు కల్లు లాంటివి* అని కల్ల బొల్లి మాటలు మాట్లాడి,రెండు జాతీయ పార్టీ లతో (కాంగ్రెస్, బీజేపి) ఏకకాలంలో సంసారం చేసిన మాజీ సమాఖ్య ఆంధ్ర ముఖ్య మంత్రి ,తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర బాబు నాయుడు ( సమాఖ్య ఆంధ్ర ముఖ్య మంత్రి, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు, స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి అల్లుడు) గారి అవసరం మీకు పడుతుంది... 



👉ఎలక్షన్స్ ముందు దాకా అంబానీ, అదానీ లను తిట్టి ఇప్పుడు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి అదానీకి ఏకంగా రెడ్ కార్పెట్ పరిచారు.. 

👉నిన్నటి దాకా ప్రదాని మోడీ ని(పైన బోడీ కింద కేడీ పేరుతో ) తిట్టి ఇప్పుడు అధికారం వచ్చాక తెలంగాణ నిధులు కేటాయింపు కోసం మీరు బోడీ అని తిట్టిన ప్రధాని మోడీ గారి అవసరం మీకు పడుతుంది 

👉 కుటుంబ పాలన పోవాలి అని చెప్పి మీరు అధికారం చేజిక్కించుకున్న తర్వాత మీరు ప్రమాణ స్వీకారోత్సవం కోసం తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ, కూతురు ప్రియాంక గాంధీ, కుమారుడు రాహుల్ గాంధీ కుటుంబాన్ని పిలిచి మాట మార్చారు 


👉 దోరల పాలన పోవాలిఅని చెప్పి ఈ దేశాన్ని గత 55ఏల్లకు పైగా గాంధీ కానీ గాంధీ దొరలు పాలిస్తుంటే (అసలు గాంధీ ఏనాడో మరణించారు నకిలీ గాంధీ లు గాంధీ పేరుతో రాజ్యమేలుతున్నరు) కనీసం మీ  పార్టీ అధిష్టానం ను ప్రశ్నించలేదు కదా మీరు తిరిగి తెలంగాణ ఇచిన సోనియమ్మ కూతురు రాహుల్ గాంధీ దోరకు ప్రధాని  పట్టాభిషేకం కోసం పరితపిస్తున్నరు!!! 



👉మీ అధిష్టానం ,కాబోయే యువరాజు అని పిలుచుకునే మీ రాహుల్ గాంధీ దోర 

ఆర్ ఎస్ ఎస్ సంస్థ పై అనేక సభల్లో విమర్శలు చేస్తే మీరు మాత్రం ఆర్ ఎస్ ఎస్ సంస్థ వల్లనే నేను రాజకీయ శిక్షణ నేర్చుకున్నాను అని అనేక మార్లు ఇంటర్వ్యూ లలో చెప్పుకోచ్చారు.. మరి మీ రాజనీతి ,మీ అధిష్టానం పట్ల మీ వైఖరి ఏంటో తెలంగాణ ప్రజలకు ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు 

👉 మరీ ముఖ్య ంగా మార్పు రావాలి కాంగ్రెస్ రావాలిఅని పత్రిక, టీవీచానల్లలో, అనేక సామాజిక మాధ్యమాలలో మీ ఫోటో మరియు పార్టీ సీనియార్ దళిత ఎమ్మెల్యే మల్లు భట్టీ విక్రమార్క గారి ఫోటోలు పెట్టుకుని ఎన్నికల ప్రచారం చేసి దలితుడిని ముఖ్య మంత్రి చేస్తానని చెప్పి మోసం చేసిన పార్టీ కంటే మార్పు కోసం కాంగ్రెస్ కు పట్టం కట్టండి అని ప్రచారం చేసి దలిత నాయకుడు, ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ గౌరవ మల్లు భట్టి విక్రమార్క ను కాదని చీమలు పెట్టి న పుట్ట ను పాములు చేజిక్కించుకున్నట్లు పార్టీ సీనియర్స్ కాదని మీరు అధికారం చేజిక్కించుకుని మీరు ప్రజల పట్ల, మీ పార్టీ పట్ల ప్రవర్తిస్తున్న ద్వంద్వ వైఖరి తెలంగాణ సమాజం చూస్తూ ఉన్నది 



👉నీల్లు, నిధులు, నియామకాలు పేరుతో తెలంగాణ ను సాధించి,దశాబ్దాల చిరకాల స్వప్నం సాధించి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్య మంత్రి కేసీఆర్ గారు ప్రజా తీర్పును శిరసావహిస్తూ  ప్రతి పక్షం లో తన బాధ్య త, అసెంబ్లీ లో తెలంగాణ ప్రజల గోంతుకను ఇంకా వినిపించకముందే తుంటి ఎముక తో ఈ మధ్యే కోలుకుని సందర్భం లో గౌరవ తెలంగాణ రెండవ ముఖ్య మంత్రి గారు *రండ గాడు* అని ముఖ్య మంత్రి స్థాయి లో ఉండి ప్రతిపక్ష నాయకుడు, మాజీ తెలంగాణ తొలి ముఖ్య మంత్రి కేసీఆర్ గారిని సంబోధించడం ఎంతవరకు సమంజసం??? 


దొరల పాలన పోవాలి అని చెప్పిన రాహుల్ గాంధీ (గాంధీ కాని గాంధీ దోర)అనే 55 ఏల్లు గా ఈ దేశాన్ని ఏలుతున్న గాంధీ కాని గాంధీ కుటుంబ దొరల ను సపోర్టు చేసిన రండ గాడు ఎవరు?? 


మామను వెన్నుపోటు పోడిచి అధికారం చేజిక్కించుకుని, ముఖ్య మంత్రి పీఠం అదిష్టించి, ఇప్పుడు కొడుకు  ను ముఖ్య మంత్రి చేయాలని పరితపించే ఆంధ్ర మాజీ ముఖ్య మంత్రి చంద్ర బాబు కి సపోర్టు చేసిన రండ గాడు ఎవరు? 

అన్న చెల్లెలు పంచాయతి పేరుతో తెలంగాణ కు వచ్చి పార్టీ ఏర్పాటు చేసి తిరిగి కాంగ్రెస్ లో కలిపేసిన ఆంధ్ర షర్మిలక్క కు సపోర్టు చేసిన రండ గాడు ఎవరు??


కార్పోరేట్ దిగ్గజం అదానీ ని తిట్టి అధికారం లోకి వచ్చాక అదానీ కి రెడ్ కార్పెట్ వేసిన రండ గాడు ఎవరు??? 



ప్రధాని మోడీ ని బోడీ అని సంబోధన చేసి తిరిగి మోడీ పంచన చేరిన రండ ఎవరు?? 

దలిత నాయకుడు మల్లు భట్టీ విక్రమార్క ను ముఖ్య మంత్రి స్థానం వస్తుందని ఊహించిన దలిత కులస్తులను ఎన్నికల సమయం లో ఆయన ఫోటో పెట్టి వాడుకున్న ,వారిని అవమానించిన రండ గాడు ఎవరో ??


మరి రండ గాడుఎవరో తేలుస్తారా గౌరవ తెలంగాణ రెండవ ముఖ్య మంత్రి గారు??????

ఇట్లు 

తెలంగాణ సామాన్యుడు



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు