పదేల్లు నేనే సీఎం...!!!! -సిఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారు కానిస్టేబుల్స్ నియామక కార్యక్రమం ఎల్బీ స్టేడియం లో మాట్లాడుతూ మరో పదేల్లు తానే ముఖ్యమంత్రి పదవిలో ఉండి ప్రజల కోసం కష్టపడి పనిచేస్తానని చెప్పారు. ప్రజల ఆశీర్వాదం ఉంటే మరో 20 ఏండ్లు ఇందిరమ్మ రాజ్యం ఉంటుందని వాఖ్యానించారు .ఈ సందర్బం గా ఆయన మాట్లాడుతూ మళ్లీ అధికారంలోకి వస్తామని మాజీ సీఎం కేసీఆర్ అంటున్నారని, ఎలా వస్తారో చూస్తానని సవాల్ విసిరారు. గత ప్రభుత్వ హయాంలో విడుదలైన నోటిఫికేషన్ల ద్వారా కానిస్టేబుల్ పోస్ట్‌లకు ఎంపికైన 13,444 మంది అభ్యర్థులకు సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో నియామక పత్రాలు వారు అందజేశారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి