ఘనంగా గులాబి దళపతి కేసిఆర్ జన్మదిన వేడుకలు!!!

 











గ్రేటర్ వరంగల్ 55 మరియు 56 వ డివిజన్లలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న అరూరి

తెలంగాణ స్వాప్నికుడు ,తెలంగాణ సాధకుడు బి అర్ ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ గారి 71 వ జన్మదిన పురస్కరించుకొని గ్రేటర్ వరంగల్ 55 వ డివిజన్ మరియు 66 డివిజన్ భీమారం మరియు హసన్ పర్తి లో డివిజన్ అద్యక్షులు అటికం రవీందర్ మరియు పాపిశెట్టి శ్రీధర్ గారి అధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో బిఅర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి రమేష్ గారు పాల్గొని కేకే కట్ చేసి కేసిఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా అరూరి రమేష్ గారు మాట్లాడుతూ.,దశాబ్దాల సంకెళ్లు తెంచి,తెచ్చిన తెలంగాణను ప్రగతి బాటలుగా పరచి మైలురాళ్ళు దాటించి దేశమంతా తలెత్తి చూసేలా తీర్చిదిద్దిన దార్శనికుడు కేసిఆర్ గారు అని పోరాటంలో తన శక్తిని ధారపోసి ప్రాణాలనే పణంగా పెట్టిన కేసిఆర్ గారు నేడు 70 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యలతో ఉండాలని వరంగల్ జిల్లా ప్రజానీకం మరియు వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజానీకం తరుపున హృదయ పూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్లు డివిజన్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు...

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు