ముస్లిం దేశంలో అతిపెద్ద హిందూ ఆలయం ను ప్రారంభించిన ప్రధాని మోడీ
యూఏఈ రాజధాని అబుదాబిలో లో నిర్మించిన అతిపెద్ద హిందూ స్వామి నారాయణ్ -బాప్స్ మందిరం ఆలయంను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. అనంతరం ఆలయం మొత్తం కన్నులారా వీక్షించారు. ఆలయంలో పూజారులతో ప్రత్యేక పూజలు నిర్వహించి, హారతి ఇచ్చారు. బోచాసన్యాసీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ - బాప్స్ ఆలయాన్ని ప్రధాని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రవాస భారతీయులు,బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ మరియు తదితర ప్రముఖులు హాజరయ్యారు. దుబాయ్ నుంచి అబుదాబి వెల్లే మార్గంలో షేక్ జాయెద్ హైవే పక్కన ఈ బాప్స్ మందిరాన్ని 27 ఎకరాల్లో నిర్మించారు. మందిరాన్ని 108 అడుగుల ఎత్తు, 262 అడుగుల పొడవు, 180 అడుగుల వెడల్పుతో నిర్మించారు. మందిరంలో 402 పాలరాతి స్తంభాలుంటే..అందులో ప్రతీ స్తంభంపై దేవతల శిల్పాలు, నెమళ్లు, ఏనుగులు, ఒంటెలు, సూర్యచంద్రులు, సంగీత వాయిద్యాల చిత్రాలను చెక్కించారు. ఈ మందిర నిర్మాణానికి దాదాపు రూ.700 కోట్లు వెచ్చించారు. రాజస్థాన్, గుజరాత్ నుంచి 2 వేల మంది కార్మికులు ఈ మందిరం నిర్మాణంకు పనిచేసారు . అయోధ్య రామ మందిరం నిర్మాణం లాగే ఉక్కు, కాంక్రీటు, సిమెంట్‌ను ఈ నిర్మాణంలో ఉపయోగించలేదు. మందిరానికి రెండు వైపులా భారత్ నుంచి భారీ కంటైనర్లలో తీసుకువచ్చిన పవిత్ర గంగా, యమునా నదీజలాల ప్రవాహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది . దీంతో అది వారణాసి ఘాట్లను తలపించేలా ఉండడం విశేషం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి