కాకతీయ తోరణం ను రాచరికం అన్న వ్యాఖ్యలను ఖండిస్తున్నాం -అరూరి
హన్మకొండ జిల్లా
హన్మకొండ బిఅర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ గారు అధ్యక్షతన నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న బి అర్ ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి రమేష్ గారు..
ఈ సందర్భంగా అరూరి రమేష్ గారు మాట్లాడుతూ...
👉 కాకతీయుల పేరు వినగానే ముందుగా మన మన మదిలో మేదిలేది కాకతీయ కీర్తి తోరణం,కాకతీయ కళా తోరణం,స్వాగత తోరణం,ద్వార తోరణం,విజయ తోరణం ఇలా అనేక పేర్లతో పిలవబడే నాలుగు కాకతీయ తోరణాలు నాటి కాకతీయుల కళా నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనం..
👉 తెలంగాణగా ప్రజల ముఖ్యంగా మన ఓరుగల్లు ప్రజల ఆత్మ గౌరవ ప్రతీక అయిన అలాంటి అధికార చిహ్నo నుండి ఈ ప్రభుత్వం తొలగిస్తామని మంత్రి వర్గం తీర్మానం చేసి స్వయంగా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా కాకతీయ తోరణాన్ని రాచరిక దర్పణం అన్న వ్యాఖ్యలను ఖండిస్తున్నాం
👉 ప్రజాభిష్టానికి ప్రజల ఆత్మగౌరవానికి విరుద్ధమైన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం..
👉సీఎం హోదాలో ఉండి తెలంగాణ చరిత్రను కనుమరుగు చేస్తే ఊరుకునేది లేదు
జిల్లా మంత్రులైన కొండ సురేఖ సీతక్క గారు ఈ అంశంపై వెంటనే స్పందించాలి..
👉 కృష్ణా నదిపై శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ, ప్రాజెక్టులను KRMBకి అప్పగించడం వల్ల రాష్ట్రానికి జరిగే నష్టాలను ప్రజలకు వివరించడానికి, తెలంగాణ హక్కుల పరిరక్షణ కొరకు బీఆర్ఎస్ అదినేత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ.కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఈనెల 13 న నల్లగొండ జిల్లా కేంద్రం నందు తలపెట్టిన భారీ బహిరంగ సభకు మద్దతుగా వరంగల్ జిల్లా వ్యాప్తంగా మరియు వర్ధన్నపేట నియోజకవర్గం నుండి బిఅర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని విజ్ఞప్తి చేశారు...ఈ కార్యక్రమంలో జిల్లా జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ బాబు,కూడా చైర్మన్ సుందర్ రాజ్, రాష్ట్ర నాయకులు నాగుర్ల వెంకన్న, మర్రి యాదవ రెడ్డి,కార్పొరేటర్లు ఇండ్ల నాగేశ్వర రావు,పాక్స్ చైర్మన్ రమేష్,వైస్ ఎంపిపి రత్నాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి