వికసిత్ భారత్ లక్యంగా వీర్లగడ్డ తండా లో ఈ శ్రమ,ఆయుష్మాన్ భారత్ రిజిస్ట్రేషన్లు

 


వికసిత్ భారత్ లక్యంగా గ్లోబల్ గాస్పుల్ ట్రైబల్ మినిస్ట్రీస్ స్వచ్ఛంద సంస్థ వారు వారు హన్మకోండ జిల్లా లోని భీమదేవరపల్లి మండలం వీర్లగడ్డ తండా లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ-శ్రమ మరియు ఆయుష్మాన్ భారత్ పథకాల పట్ల తండా వాసులకు అవగాహన కార్యక్రమం క్యాంప్ నిర్వహించారు. మరియు అర్హులైన గ్రామ ప్రజలకు కార్డుల రిజిస్ట్రేషన్ చేసారు.ఈ సందర్బంగా స్థానిక ఎంపీటిసి గుగులోతు లలిత గారి భర్త గుగులోతు శ్రీనివాస్ నాయక్ గారు ప్రారంభించి అర్హులైన గ్రామ ప్రజలు విధిగా రిజిస్ట్రేషన్ లు చేయించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ శ్రమ, ఆయుష్మాన్ భారత్ పథకాలద్వారా అసంఘటిత కార్మికులు, నిరుపేద, మధ్య తరగతి వారు లబ్ది పోందాలని గ్రామ ప్రజలకు సూచనలిచ్చారు. మరియు వైద్యం చేయించుకోలేని స్థోమత లేని వారు ఆయుష్మాన్ భారత్ పథకం కింద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు