సమన్వయంతో అభివృద్ధి చేసుకోవాలి - కడియం









సర్పంచుల పదవి కాలం ముగుస్తుండడం తో వారికి హార్ధిక శుభాకాంక్షలు తెలిపిన స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే శ్రీ కడియం శ్రీహరి గారు


లింగాల ఘనపూర్ మండల కేంద్రంలోని ఎం.పి.డి.వో కార్యాలయంలోని *సర్వ సభ్య సమావేశం ఎం.పీ.పీ శ్రీమతి చిట్ల జయశ్రీ గారి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు.


 ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి గ్రామాలను అభివృద్ధి చేయాలని *గౌరవ మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే శ్రీ కడియం శ్రీహరి గారు* అన్నారు. ప్రజాప్రతినిధులు గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. విది నిర్వహణలో అధికారులు అంకిత భావంతో పనిచేయాలన్నారు. లింగాలఘనపురం మండల ప్రాధమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలని మండల విద్యాశాఖ అధికారులను సూచించారు. మండల స్థాయి అధికారులంతా విస్తృతంగా క్షేత్రస్థాయిలో పర్యటించి, పూర్తి సమాచారం తో ఉండాలని సూచించారు. లింగాలఘనపురం మండలం లో 27 వేల ఎకరాలకు వచ్చే ఖరీఫ్ పంటకు సాగు నీటిని అందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం... పదవి ముగియనున్న సర్పంచులను ఘనంగా సన్మానించారు. 


ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు, మండల కో ఆప్షన్ సభ్యులు, ఎం.పీ.డీ.ఓ, స్థానిక ఎమ్మార్వో, మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు