జాతీయ జెండా పోల్ కు విద్యుత్ వైర్లు తగిలి ఇద్దరు యవకులు మృతి

 -


-మృతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన రాష్ట్ర  పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి& స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు 


ఈ రోజు 75 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ములుగు జిల్లా కేంద్రానికి చెందిన బొడ అంకిత్ కుమార్

ల్యాడ విజయ్, బోడ కళ్యాణ్ చక్రి లు జాతీయ జెండా పోలు కరెంట్ తీగలకు తాకి ప్రమాదం లో గాయపడగా బొడ అంకిత్ కుమార్, ల్యాడ విజయ్ లు మరణించగా కళ్యాణ్ చక్రి స్వల్ప గాయాలు కావడం తో వారిని ములుగు జిల్లా హాస్పటల్ కు తరలించగా హుటాహుటిన హస్పట్లకు చేరుకొని బాధిత  కుటుంబాలను పరామర్శించి మృతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 5 లక్షల ఎక్స్ గ్రేషియ తో పాటు తక్షణ సహాయం 10 వేల ఆర్థిక సాయం అందించిన మంత్రి వర్యులు సీతక్క గారు

ఈ సందర్భంగా మాట్లాడుతూ వేడుకలు జరిగేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ ఘటన దురదృష్టకరమని బాధిత కుటుంబాలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ గాయపడిన కల్యాణి చక్రి కి మెరుగైన  వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ గారితో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు










కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు