సమరయోధుల త్యాగ ఫలం.. నేటి గణతంత్ర సంబరం
గాంధీ, అంబేత్కర్ విగ్రహాలను పూలమాల వేసి నివాళులర్పించిన మంత్రి వర్యులు సీతక్క
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క
ఈ రోజు ములుగు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మరియు గాంధీ పార్క్ ఎదుట,మరియు DCM యూనియన్ ఆధ్వర్యములో 75 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రి వర్యులు సీతక్క గారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులను, త్యాగమూర్తులను స్మరిస్తూ.. సెల్యూట్ చేసే రోజు కూడా ఇదే. అమర వీరుల త్యాగాలను గుర్తుతెచ్చుకుంటూ.. మన గుండెల్లో నిండిన దేశభక్తిని చాటుతూ.. సగర్వంగా మన భరతమాతకు వందనాలు తెలుపుకుందాం అని
ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన కార్యక్రమం
నూతన ప్రభుత్వం పారదర్శక పాలన అందించడానికి, మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్‌రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని
ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం,
సమాన అవకాశాలు దక్కాలనేదే ప్రభుత్వ లక్ష్యం. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం 2023 డిసెంబర్ 28వ తేదీ నుండి 2024 జనవరి 6వ తేదీ వరకు, 8 రోజుల పాటు
నిర్వహించింది.రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలలో రెండు గ్యారెంటీలను ఇప్పటికే
పకడ్బందీగా అమలు చేస్తుంది. ప్రజాపాలన కార్యక్రమం ద్వారా మిగతా పథకాలైన రైతు
భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి, చేయూత పథకాల కోసం ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించి అర్హులైన ప్రజల నుండి 2 లక్షల 50 వేల 367 దరఖాస్తులను స్వీకరించడం జరిగింది. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం జరిగింది.
మహిళలకు మహాలక్ష్మి పథకం
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యాచరణతో రాష్ట్ర
ప్రభుత్వం ముందుకు సాగుతుంది. మహిళా సంక్షేమంలో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లు రాష్ట్రంలోని ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్.టీ.సీ. బస్సుల్లో జీరో టికెట్ ఆధారంగా ఉచితంగా ప్రయాణించేందుకు 2023 డిసెంబర్ 9న గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్‌రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది అని మిగితా సంక్షేమ పథకాలు త్వరలోనే అమలు చేస్తామని
మంత్రి గారు అన్నారు
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ గారితో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా,మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి