నియోజకవర్గ ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగుతుంది.అరూరి

 


బిఆర్ఎస్ పార్టీ శ్రేణులను కంటికి రెప్పలా కాపాడుకుంటాం..

నాయకులు, కార్యకర్తలు ఎవరూ బాధపడొద్దు, అదైర్య పడొద్దు....

అన్నివేళలా అందుబాటులో ఉంటూ, అండగా ఉంటా....


మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు అరూరి రమేష్ గారు...

హంటర్ రోడ్డు లోని పార్టీ కార్యాలయంలో 44 మరియు 45 వ డివిజన్ల ప్రజాప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశంలో అరూరి రమేష్ గారు పాల్గొన్నారు..









ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని గత రెండు పర్యాయలు రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ద్యేయంగా బిఆర్ఎస్ ప్రభుత్వం పాలన సాగించిందని రాజకీయాలలో గెలుపొటములు సహజం అని తెలిపారు. అధికారంలో లేకపోయినా ప్రజా సమస్యల పట్ల పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు. వర్దన్నపేట నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగేలా చూస్తామని పేర్కొన్నారు. వర్దన్నపేట బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎవరూ బాధ పడవద్దు, అదైర్యపడొద్దని కోరారు. పార్టీ నాయకులను, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని తెలిపారు. పదవిలో ఉన్నా లేకపోయినా నియోజకవర్గ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, వారి కష్ట సుఖలలో అండగా ఉంటానని హామీ ఇచ్చారు.నియోజకవర్గంలో పార్టీ బలోపేతం చేయడమే ప్రధమ కర్తవ్యం అని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నాయకులను కార్యకర్తలను సర్పంచులుగా,ఎంపిటిసి లుగా గెలిపించుకునేలా కార్యచరణ రూపొందించుకొని ముందుకు వెళదాం అని ప్రతి నిత్యం ప్రజల సమస్యలపై పోరాడుతానని త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేద్దం అని అన్నారు..కాంగ్రెస్స్ పార్టీ ప్రజలకిచ్చిన హమీలను అమలు చేయాలని నియోజకవర్గంలో జరిగే అభివృధ్ది కొనసాగించాలని అన్నారు...ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ నాగేశ్వర రావు,పాక్స్ చైర్మన్లు వనం రెడ్డి, జైపాల్ రెడ్డి,రైతు బందు అద్యక్షులు సంపత్ రెడ్డి,నాయకులు రామచంద్ర రెడ్డి,భద్రన్న, రజినికర్ రెడ్డి,కుమారస్వామి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు