పదేళ్లకు ముందు వర్దన్నపేట ఎలా ఉంది.... ఇప్పుడు ఎలా ఉంది??-అరూరి
నూతన మున్సిపాలిటీతో మారిన వర్దన్నపేట రూపురేఖలు...
ఓటమికి కుంగి పోవల్సిన అవసరం లేదు
వర్దన్నపేట ప్రజల మద్దతుతో మరింత ముందుకు వెళదాం!!
రాబోయే ఎన్నికల్లో బి అర్ ఎస్ పార్టీ జెండా ఎగురవేద్దా0!!
కార్యకర్తలను కాపాడుకుంటూ పార్టీ బలోపేతం పై దృష్టి సారిద్దాం!!
ఐనవోలు పార్టీ కార్యాలయంలో వర్దన్నపేట మున్సిపాలిటీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న బి అర్ ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి రమేష్
ఈ సందర్బంగా అరూరి మాట్లాడుతు...
వర్దన్నపేట నియోజకవర్గ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే సంకల్పంతో గతంలో ఎన్నడూ లేని విధంగా మాజి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజి మంత్రి వర్యులు కేటీఆర్ గార్ల ఆశీస్సులతో వర్దన్నపేట మున్సిపాలిటీని 239 కోట్ల 81లక్షల 79వెల ప్రత్యేక నిధులు తీసుకువచ్చి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.వర్దన్నపేట నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రభాగాన నిలపడమే కాకుండా ప్రతీ గడకు సంక్షేమ ఫలాలు ఆందించేందుకు కృషి చేయడం జరిగింది..కానీ దురదృష్టవశాత్తు ఓడిపోవడం జరిగింది.ప్రజా తీర్పుని గౌరవిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చెద్దామని ఓటమి పై సమీక్షించుకుని రాబోయే ఎన్నికల్లో మరింత సత్తా చాటి బిఅర్ఎస్ పార్టీ జెండా ఎగేరెద్దామని అన్నారు.కార్యకర్తలకు ఎటువంటి కష్టం వచ్చిన నిత్యం అందుబాటులో ఉంటూ వారి కష్ట సుఖాలలో పాలు పంచుకుంటానని అన్నారు. కాంగ్రెస్స్ పార్టీ ఏ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో వెంటనే హమీలను నెరవేర్చాలని మున్సిపాలిటీ లో అభివృధ్ది పనులు కొనసాగించాలని డిమాండ్ చేయడం జరిగింది..
ఈ కార్యక్రమంలో జిల్లా డీసీసీబీ చైర్మన్ మార్నేనీ రవీందర్ రావు గారు, మున్సిపల్ చైర్మన్ అరుణ,వైస్ చైర్మన్ ఏలెందర్ రెడ్డి,పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్, కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు...
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి