అధికారంలో ఉన్నా, లేకున్నా.. తెలంగాణ ప్రజల దళం, బలం, గళం ఎప్పటికీ బీఆర్‌ఎస్సే - అరూరి రమేష్


















అధికారంలో ఉన్నా, లేకున్నా.. తెలంగాణ ప్రజల దళం, బలం, గళం ఎప్పటికీ బీఆర్‌ఎస్సే అని  ఇదే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళదామని అన్నారు  బిఅర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి రమేష్ గారు...


హంటర్ రోడ్డులోని CSR గార్డెన్స్ లో అరూరి రమేష్ గారి అధ్యక్షతన వర్ధన్నపేట నియోజకవర్గ విసృత స్థాయి సమావేశం జరిగింది..ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా మాజి మంత్రి వర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, ఎంపి పసునూరి దయాకర్ గారు పాల్గొన్నారు...



అరూరి రమేష్ గారు మాట్లాడుతూ...


👉ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం ఓడిపోయినప్పటికీ నియోజకవర్గ ప్రజల పక్షాన నిలబడి సమస్యల పరిష్కారానికి అభివృద్ధికి కృషి చేస్తాను


 👉గత ప్రభుత్వం హయాములో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలి



 👉ఎన్నికల్లో ఓట్ల కోసం పోటీపడిన విధంగానే వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం పోటీపడాలి


👉రైతుబంధు, సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి కోసం ఆయా వర్గాల ప్రజలు ఎదురుచూస్తున్నారు..ప్రభుత్వం వెంటనే ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేయాలి


 

 👉గత శాసనసభ ఎన్నికల్లో ఓటమికి దారి తీసిన పరిస్థితులని సమీక్షించుకొని తిరిగి పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం


 👉వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలి


 👉అభివృద్ధిని స్వాగతిస్తాం.. లేకుంటే ప్రజా సమస్యల పైన నియోజకవర్గ అభివృద్ధి పైన ప్రజల పక్షాన ఉండి ప్రభుత్వంపై పోరాడుతాం


👉 పదేళ్లలోనే 50 ఏండ్ల అభివృద్ధిని కండ్లచూపిన ఘనత మన బీఆర్‌ఎస్‌ సర్కార్‌ది. 


👉 తన విజన్‌తో జనం గుండెల్లో నిలిచిన నేత కెసిఆర్ గారు..


👉 దురదృష్టశాత్తూ మన ప్రభుత్వం ఏర్పడలేదు.


👉 ప్రజా తీర్పును గౌరవిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుదాం..


👉 రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిఅర్ఎస్ పార్టీ జెండా ఎగరేద్దాం.


👉 కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా.వారి కష్ట సుఖాల్లో అండగా ఉంటా.


👉 జిల్లాలో పార్టీ బలోపేతం పై ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని ముందుకు వెళ్దాం.


నిరంజన్ రెడ్డి గారు మాట్లాడుతూ..


👉ఓటమిపై సమీక్షించుకుని రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతం చేయడమే లక్షoగా ఈ సమావేశం నిర్వహించుకుంటున్నం..


👉మూడోసారి మోడీకి ఓట్లు ఎందుకు వేయాలి

అక్షింతల పేరుతో రాజకీయాలు చేస్తున్నాడు.


👉కాంగ్రెస్ రైతుబంధు ఇవ్వకుండా నోట్లో అరటిపండు పెట్టింది.


👉కెసిఆర్ కంటే గొప్పగా ఇస్తామని చెప్పి ఇప్పుడు ఏమైంది ప్రజలు కాంగ్రెస్ మాయ మాటలు నమ్మి మోసపోయారు..


👉వంద రోజుల్లో కాకపోతే ఐదు సంవత్సరాలలోపు మీ హామీలు నెరవేర్చండి

ప్రజలు మీ హామీలపై నిలదీస్తారు..


ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత డిసెంబర్ 9వ తేదీన  రైతుబంధు రైతుల అకౌంట్ లో వేస్తామని చెప్పారు ఇంకా వెయ్యలేదు ఎందుకు అని ప్రశ్నించారు.


కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చక పూర్తిగా విపలం అవుతుంది


కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 50 రోజులలోనే బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై, కార్యకర్తలపైన భౌతిక దాడులు చేస్తున్నారు.


మన పార్టీ కార్యకర్తలకు కష్టం వస్తే అందరం ఒకటి కావాలి


కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో విషప్రచారం చేసి గెలిసింది.


చిన్న చిన్న కారణాలతో మనం ఓడిపోయాం, కార్యకర్తల సూచనలు పరిగణనలోకి తీసుకొని పార్టీని బలోపేతం చేద్దాం...


అనంతరం నియోజకవర్గంలోని వివిధ మండలాల లోని గ్రామాల సర్పంచులు పదవి కాలం ఈనెల ముగుస్తుండడంతో వారికి అరూరి రమేష్ గారి చేతుల మీదుగా వారి సేవలకు గుర్తింపుగా  సర్పంచులను సన్మానించడం జరిగింది...



ఈ కార్యక్రమంలో జిల్లా డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు,జిల్లా రైతు బందు కో ఆర్డినేటర్ లలితా యాదవ్,జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ శ్రీరాములు,జిల్లా కో ఆప్షన్ సభ్యులు ఉస్మాన్ అలీ,సర్వర్, కార్పొరేటర్లు రాధిక రెడ్డి,శిబా - అనిల్, అరుణ - విక్టర్,రజిత - శ్రీనివాస్,దివ్య రాణి - రాజు నాయక్,సునీల్, జెడ్పీటీసీలు బిక్షపతి,సునీత, ఎంపిపిలు మధుమతి,అప్పారావు,సునీత,కమల, మున్సిపల్ చైర్మన్ అరుణ,మండల పార్టీ అధ్యక్షులు రజిని కుమార్, శంకర్ రెడ్డి, కుమారస్వామి, కుమార్, పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్,డివిజన్ అద్యక్షులు శ్రీధర్ ,రాజు,కుమార్ యాదవ్,నరసింహ, స్పందన్,జైపాల్,వినోద్,శ్రీకాంత్, శ్రీధర్, మనింద్ర నాథ్,రవీందర్,పాక్స్ చైర్మన్లు హరికృష్ణ, రాజేశ్ కన్నా,దేవేందర్, మనోజ్ గౌడ్,గోపాల్ రెడ్డి,రమేష్,రైతు బందు కో ఆర్డినేటర్లు సంపత్ రెడ్డి, శ్రీనివాస్,సమ్మయ్య,విజయ్,మార్కేట్ చైర్మన్ స్వామీ రాయుడు,వైస్ ఎంపీపీలు రాజేశ్వర రావు,సోమలక్ష్మి - సోమయ్య,మోహన్, రత్నాకర్ రెడ్డి,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు