దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం ఏర్పడలేదు..అరూరి

 ఓటమికి కుంగిపోవద్దు...మనం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు పొంగిపోలేదు...

అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా మనం ప్రజల పక్షమే - మాజి శాసన సభ్యులు అరూరి రమేష్

హంటర్ రోడ్డులోని పార్టీ కార్యాలయంలో గ్రేటర్ వరంగల్ 43 వ డివిజన్ అద్యక్షులు అక్కేనప్లలి స్పoదన్ గారి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో అరూరి రమేష్ గారు పాల్గొన్నారు...


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దురదృష్టవశాత్తూ మన ప్రభుత్వం ఏర్పడలేదు అని ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసిన నియోజకవర్గంలో చాలా అభివృధ్ది కార్యక్రమాలు చేసిన ప్రజలు కాంగ్రెస్స్ పార్టీకి పట్టం కట్టరని అన్నారు... కాoగ్రేస్ పార్టీ అబద్ధపు హామీలతో ప్రజలను నమ్మించిందని ఇప్పటికైన హమీలను నెరవేర్చాలని,ఓటమికి కుంగిపోవద్దు మనం అధికారంలో ఉన్న పొంగిపోలేదు ఇపుడు అధికారం లేదని కుంగిపోవల్సిన అవసరం లేదని ప్రజల మధ్య ఉంటూ ప్రజల పక్షాన పొరడుదామని అన్నారు..గ్రేటర్ వరంగల్ లో బి అర్ ఎస్ ప్రభుత్వం కేటాయించిన నిధులను రద్దు చేయాలని చూస్తుందని రోడ్లు,భవనాల వంటి ప్రజా ప్రయోజన మౌలిక వస తుల కోసం కేటాయించిన నిధులను రద్దు చేయొద్దని సూచించారు.. కార్యకర్తలు ఎవరు అదైర్య పడొద్దు అన్నివేళలా అందుబాటులో ఉంటూ అండగా ఉంటామని అన్నారు..పదవిలో ఉన్న లేకపోయినా  ప్రజా సమస్యలపై పోరాటం చేద్దాం అని అన్నారు..నియోజకవర్గంలో పార్టీ బలోపేతం చేయడమే ప్రధమ కర్తవ్యం అని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ జిల్లాలో గులాబీ జెండా ఎగిరెలా కార్యాచరణ రూపొందించుకొని ముందుకు వెళ్దాం అని అన్నారు..


ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ అరుణ - విక్టర్,డివిజన్ మహిళ అధ్యక్షురాలు రాణి,డివిజన్ ప్రధాన కార్యదర్శులు హనుమన్ రెడ్డి,రవి,పాక్స్ డైరెక్టర్ షణ్ముఖ రెడ్డి,నాయకులు రాములు, వెంకట్ రెడ్డి, జగపతి,బాబు,జయశంకర్, క్రాంతి,జీవంత్ రెడ్డి,సారయ్య,గ్రామాల అధ్యక్ష,కార్యదర్శులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.









కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు