పార్టీలు మారె చరిత్ర నాది కాదు.-అరూరి






ప్రశాంత్ నగర్,హన్మకొండ

పార్టీ మారుతున్నట్టు వచ్చే అసత్య ప్రచారాలను నమ్మొద్దు - అరూరి రమేష్



గత కొన్నిరోజులుగా నేను పార్టీ మారుతున్నట్టు వచ్చే అసత్య ప్రచారాలను ఎవరు నమ్మవద్దని అన్నారు బి అర్ ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి రమేష్ గారు..హన్మకొండ  ప్రశాంత్ నగర్ లోని వారి నివాసంలో వారు మాట్లాడుతూ....


👉2012 లో PRP పార్టీ విలీనం తర్వాత ఉద్యమ నాయకుడు కెసిఆర్ గారి నాయకత్వంలో BRS పార్టీలో చేరడం జరిగింది.


👉అప్పడినుండి క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా పార్టీకోసం అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది.


👉నా యొక్క పని తీరును గుర్తించి BRS  అధినేత గౌరవ మాజీ ముఖ్య మంత్రి వర్యులు కెసిఆర్ గారు వర్ధన్నపేట నియోజకవర్గ ఇంచార్గిగా ,3 సార్లు వర్ధన్నపేట నియోజకవర్గ శాసన సభ్యునిగా మరియు పార్టీ జిల్లా అద్యక్షునిగా అవకాశం ఇవ్వడం జరిగింది.


👉 నియోజకవర్గ అబివృద్ది కోసం మరియు పార్టీ కార్యక్రమాల్లో అనుక్షణం కష్టపడుతూ పనిచేయడం జరుగుతుంది.


👉 రాజకీయంగా నన్ను ఎదురుకోలేని కొంతమంది దద్దమ్మలు,పిరికిపందలు నాపై లేని పోనీ అసత్య ప్రచారాలు చేయడం జరుగుతుంది.


👉 ఆరూరి రమేష్ మాట మిద నిలబడే వ్యక్తి.


👉 నమ్ముకున్న కార్యకర్తని కంటికిరెప్పల కాపాడుకునే వ్యక్తీ.


👉 బిఆర్ఎస్ పార్టీ కోసం అనుక్షణం సైనికుడిలా పని చేసే వ్యక్తిని.


👉 వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఎవరిని నిలబెట్టిన జిల్లా అద్యక్షునిగా బారి మెజారిటితో గెలిపిస్తాను.


👉 అరూరి ఎప్పుడు కెసిఆర్ మనిషే..


👉 కార్యకర్తలు ఎవరు వదంతులను నమ్మవొద్దు..


👉 గెలిచిన ఓడిన నిరంతరం నియోజకవర్గ అభివృధ్ది కోసం మరియు జిల్లాలో  బిఅర్ఎస్ పార్టీ బలోపేతం కోసం కష్ట పడుదాం..


ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు నాగేశ్వర రావు,సునీల్,రజిత - శ్రీను,పాక్స్ చైర్మన్లు వనం రెడ్డి,హరి కృష్ణ, హసన్ పర్తి మండల పార్టీ అధ్యక్షుడు రజిని కుమార్,పాక్స్ వైస్ చైర్మన్ మల్లా రెడ్డి,డివిజన్ అద్యక్షులు శ్రీధర్, వినోద్,వర్ధన్నపేట పట్టణ అధ్యక్షుడు శ్రీను,మాజి కార్పొరేటర్ బిక్షపతి,నాయకులు సుదర్శన్,రాజు,హరీష్,నాగరాజు, భరత్,తదితరులు పాల్గొన్నారు.



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు